Herbal Tea : ఈ రోజుల్లో ఒత్తిడి కారణంగా చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంట్లో ఫ్యామిలీ ఒత్తిడి, ఆఫీసులలో పని ఒత్తిడి.. ఇలా రకరకాల ఒత్తిడికి గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు, పద్ధతులు పాటించడం ద్వారా ఒత్తిడి సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రోజు డైట్ లో కొన్ని రకాల టీలను, ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన టీలను తీసుకోవడం వల్ల మానసిక స్థితి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. నేటి కాలంలో ప్రజల్లో ఒత్తిడి ఆందోళన మానసిక ప్రవర్తన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్య తీవ్రంగా మారడం ప్రారంభిస్తే, మానసిక వైద్యులైన సంప్రదించడం లేదా చికిత్స చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. ఆయుర్వేదంలో ఉపయోగించే అనేక రకాల మూలికలు సమస్యల ప్రభావాన్ని తగ్గించడంలో, మానసిక వ్యాధులు ఏం చేయడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి.
చామంతి : ప్రస్తుత కాలంలో చామంతి టీ ఫేమస్ అయ్యింది. ఇది చామంతి పువ్వు నుంచి తయారు చేస్తారు. ఇందులో అనేక రకాల ఔషధాల ప్రయోజనాలు ఉన్నాయి. 2013లో జరిగిన ఓ అధ్యాయంలో 8 వారాల పాటు చామంతి టీ తీసుకోవడం వల్ల వివిధ రకాల ఆందోళన లక్షణాలను తగ్గించవచ్చు అని కనుగొన్నారు. అయితే చామంతి వల్ల కొందరికి అలర్జీ కూడా వస్తుందని కాబట్టి వారికి చామంతి వినియోగం పట్ల ప్రత్యేక దృష్టి సారించారు.
Herbal Tea : ఈ హెర్బల్ టీ ని ఒక్కసారి తాగారంటే…

అశ్వగంధం : ఆయుర్వేద ఔషధం అశ్వగంధం అనే రకాల శారీరిక సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మానసిక ఆందోళన, నిరాశ, నిద్రలేని సమస్యలను దూరం చేస్తుంది. 2019లో జరిగిన ఓ అధ్యాయంలో ఒత్తిడి లేదా ఆందోళనతో ఉండేవారు పాల్గొన్నారు. వారం రోజులపాటు ఈ పరిశోధన జరిగింది. వీరిని మూడు సమూహాలుగా వర్గీకరించారు. రెండు గ్రూపులకు రోజు 250, 60mg అశ్వగంధం సారం ఇచ్చారు. మూడో గ్రూప్ కి ప్లేసి బో మోతాదు ఇచ్చారు. అయితే… అశ్వగంధ ని తీసుకునే పాల్గొనే వారిలో ప్లేసి బో తీసుకునే సమూహం కంటే తక్కువ మొత్తంలో కార్డిస్టోల్ ఉన్నట్లు పరిశోధనల ఫలితాలు వెలువడించాయి.
లెమన్ టీ : 2004లో నిర్వహించిన క్లినికల్ ట్రయాల్ లో మానసిక ఒత్తిడితో బాధపడుతున్న కొంతమంది పాల్గొన్నారు వీరికి 600 mg లెమన్ టీ ని క్రమం తప్పకుండా అందించారు. ఈ పరిశోధనలో ఫలితాలు చాలా సానుకూలంగా బయటపడ్డాయి