Crow : మన హిందూ ధర్మాలలో కాకికి ప్రత్యేకమైన స్థానం ఉంది. హిందూ పురాణాలలోని స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వేల కాకి మీ కలలోకి వచ్చినట్లయితే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అయితే కాకి కలలో కనిపించడం అనేది అంత మంచి విషయం కాదు. కానీ ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేకంగా కనిపించినట్లయితే ఆ కలలను మంచి కలలుగా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎగురుతున్న కాకి కనిపించినట్లయితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పు జరగబోతుందని అర్థమట. అంతేకాక రాబోయే రోజుల్లో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే దానికి సంకేతంగా భావించవచ్చు.
అలాకాకుండా మీ కలలో చాలా కాకులు ఒకే చోట గుమ్మిగూడినట్లుగా , లేదా ఒకేసారి ఎగురుతున్నట్లుగానో కనిపించినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఒక చెడు వార్త వింటున్నారని అర్థమట. అలాగే కలలో మాట్లాడుతున్న కాక కనిపించినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సంకేతంగా భావించవచ్చు. అలాగే కూర్చున్న కాకి కలలో కనిపిస్తే మీరు చేసే పనులకు ఆటంకం ఎదురవుతుంది.అలాగే ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కలలు వచ్చినప్పుడు జాగ్రత్త వహించాలి. అయితే ఇలా ఏదైనా చెడుగా కల వచ్చినట్లయితే ఆ కలని వీలైనంత ఎక్కువ మందితో చెప్పుకోవాలి. అలా చెప్పడం ద్వారా చెడుకల యొక్క ప్రభావం తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది.
అంతేకాక కలలో మాంసాన్ని తింటున్న కాకి కనిపించినట్లయితే ఇది చాలా మంచి కలగా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా కల వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ధన లాభం పొందే అవకాశం ఉన్నట్లు సంకేతమట. అలాగే కలలో మీరు కాకిని చంపుతున్నట్టుగా లేదా తరుముతున్నట్లుగాని కనిపిస్తే రాబోయే రోజుల్లో మీరు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారని అర్థమట. అలాగే మీరు మీ కలలో చనిపోయిన కాకిని చూసినట్లయితే మీరు మీ జీవితంలో ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తోలగుతాయని సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.