Rashmi Gautam : వామ్మో… రష్మీ 6 లక్షల బంగారం కొంటే బిల్ ఎవరు కట్టారో తెలుసా…?

Rashmi Gautam : బుల్లితెరపై రష్మి గౌతమ్ అనసూయ భరద్వాజ్ శ్రీముఖి వంటి వారు మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాక వీరు ముగ్గురు ఒక్కొక్క షోకి భారీగానే రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారు. ఇక బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమం జరిగిన వీరి సందడే ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆ తర్వాత విష్ణు ప్రియ మరియు దీపిక పెళ్లి కూడా బుల్లితెరపై అలా అలా నెట్టుకొస్తున్నారు. కానీ రష్మీ మరియు అనసూయ ,శ్రీముఖి మాత్రం వారి అందచందాలతో ,అభినయంతో మంచి మంచి ఆఫర్స్ ను కొట్టేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు. అయితే రష్మీ ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అలాగే హీరోయిన్ గా సెట్ అయ్యేందుకు లిప్ కిస్సులు కూడా పెట్టడం జరిగింది.

Advertisement

wow-do-you-know-who-footed-the-bill-if-rashmi-bought-6-lakh-gold

Advertisement

అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అదృష్టం తలుపు తట్టలేదు. ఈ కాలంలోనే సుడిగాలి సుదీర్ తో జబర్దస్త్ షోలో లవ్ ట్రాక్ నడిపి ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఇక అనసూయ విషయానికొస్తే ఇప్పుడు బుల్లితెరను వదిలిపెట్టి వెండితెరపై ఈ ముద్దుగుమ్మ అడుగులు వేస్తోంది. హీరోయిన్ గా కాకపోయినా మంచి మంచి క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలో రష్మీ కంటే అనసూయకే మంచి ఆదరణ లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక శ్రీముఖి విషయానికి వస్తే బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు భారీగా వచ్చినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైన మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ ముగ్గురు యాంకర్లు అటు సిల్వర్ స్క్రీన్ మరియు స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ వస్తున్నారు. అయితే వీరికి అవకాశాలు ఇచ్చేది మాత్రం బయట ఉన్న బడా బాబులంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.

wow-do-you-know-who-footed-the-bill-if-rashmi-bought-6-lakh-gold

ఈ క్రమంలోనే ఇటీవల ఓ జువెలరీ మాల్ కి వెళ్తే రష్మీ దాదాపు 6 లక్షలు విలువచేసే బంగారాన్ని కొనుగోలు చేస్తే దాని బిల్ మాత్రం ఓ రాజకీయ నాయకుడు కట్టారని ప్రచారం జరుగుతుంది. అంతేకాక యాడ్ ఫిలిమ్స్ డైరెక్టర్ కి కాల్ చేసి మరి ఈ జువెలరీ వారికి నేను యాడ్స్ చేశాను కదా కొంచెం డిస్కౌంట్ కావాలని కూడా అడిగిందట. ఇక ఆ డిస్కౌంట్ అమౌంట్ కాస్త తన బ్యాగ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే చిన్న స్క్రీన్ అయినప్పటికీ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంటే మాత్రం ఎలాంటి శ్రమ లేకుండానే అన్నీ దక్కుతాయి అనిపిస్తుంది. మరి ఇలా వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement