Amala Paul : తన అందంతో నటనతో అందరినీ ఆకట్టుకుని అమలాపాల్ ప్రస్తుతం కెరియర్ పరంగా వైవిధ్యంగా ఆలోచిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే గ్లామర్ రోల్స్ పక్కనపెట్టి బలమైన కథలను ఎంచుకుంటూ సాగుతుంది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ కూడా బాగా పెరిగిందని చెప్పాలి. దానికి గల కారణం ఆమె ఎంచుకుంటున్న వైవిద్య భరితమైన కథలు అనిచెప్పాలి. ఎవరు ఊహించని విధంగా అలాంటి పాత్రలలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే పాత్ర బాగా నచ్చితే తన అందాలను చూపించడానికి కూడా ఈ ముద్దుగుమ్మ వెనకాడడం లేదు. ఈ క్రమంలోనే ఆడై అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ రెచ్చిపోయి మరి అందాలను చూపించింది. ఒక తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా “ఆమె” అనే పేరుతో విడుదలైన సంగతి తేలిసిందే.
అయితే ఈ సినిమాలో ఆమె ఇలా నటించడం గురించి కొందరు ప్రశంసిస్తే మరి కొందరు విమర్శించారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తన దారిలో తాను ముందుకెళ్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ కుర్రాకారులను ఆకర్షించే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ ట్రేండింగ్ లో ఉంటుంది. అయితే రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటుంది. ఏ విషయమైనా సరే ముక్కు సూటిగా చెప్పటం ఆమె నైజం. అయితే అమలాపాల్ తన పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని ఒడిదుడుకులని ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. 2014లో దర్శకుడు ఏ ఎల్ విజయ్ అమలాపాల్ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇద్దరు మధ్య విభేదాలు రావడంతో 2017 లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొన్నాలపాటు సింగిల్ గా ఉన్న అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
ఇక ఆ సమయంలో స్పందించిన అమలాపాల్ అది కేవలం యాడ్ షూట్ అని క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సింగిల్ గా ఉంటుందనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే తాజాగా తన 32వ పుట్టినరోజు సందర్భంగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడుతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అంతేకాక ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ప్రియుడు ఆమెకు ప్రపోజ్ చేయగా ఆమె కూడా ఓకే చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ప్రియుడు జగత్ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో జగత్ దేశాయ్ అమలాపాల్ కు ప్రపోజ్ చేయడం ,దానిని ఆమె యాక్సెప్ట్ చేయడం కూడా చూడవచ్చు. దీంతో ఈ వీడియో చూసిన నేటిజనులు అమలాపాల్ కు విషెస్ తెలుపుతున్నారు.
View this post on Instagram