Vastu Tips : మనం చాలా ప్రాంతాలలో ఆలయాలనే దర్శించడం చేసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అమ్మవారితో సహా స్వామి వారి వెలిసిన ఆలయాలలో స్వామివారికి ఎడమవైపున అమ్మవారు కోలుదీరీ ఉంటారు. అదేవిధంగా శుభకార్యాలలోనూ, దైవ సంబంధిత కార్యక్రమంలోనూ భర్తకు ఎడమవైపు మాత్రమే భార్య ఉండాలని మన పెద్దలు చెప్తుంటారు. ఇంట్లో ఏమైనా వ్రతం ,నోములో కూర్చోవాలన్నా, ఫోటో దిగాలన్న భర్తకు ఎడమవైపు మాత్రమే భార్య ఉండాలని…
Vastu Tips : భార్య, భర్తకు ఎడమ వైపునే ఎందుకు ఉంటుందో తెలుసా.
ఈ విషయాన్ని మాత్రం అసలే మర్చిపోరు. భారతీయుల జీవన విధానంలో ఈ ఆచారం ఎంతగానో ముడిపడిపోయింది. మన పెద్దవారు ఈ పని చేసిన.. దానికో ఒక అర్థం , పరమార్ధం ఉంటుంది. ఇదే విషయం మరొకసారి స్పష్టమైంది. శరీరంలో కుడి భాగాన్ని సవ్యభాగమని… ఎడమ భాగాన్ని అప సవ్వ భాగమని అంటారు. కుడి భాగానికి ఉండే శక్తి సామర్థ్యాలు ఎడమ భాగానికి ఉండమంటారు. అందుకే ఎడమ భాగానికి ఎప్పటికప్పుడు శక్తి అవసరం అవుతుంది.
కుడి భాగాన్ని శివుడికి సంకేతకంగా భావిస్తారు. ఎడమ భాగాన శక్తికి సంకేతకంగా చెబుతుంటారు. ఈ కుడి ఎడమల కలిగిన అర్ధనారిశ్శర రూపం అంటారు. శరీరంలో ఎడమ భాగం శక్తికి సాంకేతికం కాబట్టి.. భర్తకు ఎడమవైపునే భార్య ఉండాలని ఆచరించారు. ఈ ఆచారాన్ని పాటించడం వల్ల ఆలోచన, ఆచరణ ఈ రెండు కూడా సమపాలిగా కలిసి జీవితాన్ని ఆనందంగా ముందుకి నడుపుతారని నమ్మకం.