Ayurvedic Tips : కరోనా వైరస్ ఎంటర్ అయిన తర్వాత అందరూ ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఊహిస్తున్నారు. ఈ సమయంలో ఆయుర్వేద చిట్కాలు వైపు ఆసక్తి చూపుతున్నారు. సరియైన క్రమంలో ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుందనే చెప్పవచ్చు. ఆయుర్వేద వైద్య పద్ధతులు అంటే అవి ఎలా ఉంటాయో అని అనుకుంటారు కొందరు… మన ఇంట్లో పెద్దవారిని అడిగితే ఇవన్నీ తెలియజేస్తారు. ఇటువంటి ఆయుర్వేద పద్ధతి వల్ల ప్రతి వ్యక్తి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వీటి వలన ఎటువంటి వ్యాధులకు గురికాకుండా రక్షణ కలిగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే జబ్బులు బారిన పడకుండా ఉండవచ్చు.
నెయ్యి ఆరోగ్యానికి మంచిదన్న విషయం మనందరికీ తెలుసు.. ఆక్సిడెంట్లు మరియు కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఫ్యాటీ ఆసిడ్ తో అధికంగా ఉన్న నెయ్యి ఆరోగ్యపరమైన కొలస్ట్రాలను అందజేస్తుంది. కొవ్వు కణజాలాలను తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని అధికం చేస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాలు ఎనర్జీని ఉత్పత్తి చేసి జీర్ణ క్రియ వ్యవస్థను వేగవంతం చేస్తుంది.
Ayurvedic Tips : వివిధ రకాల వ్యాధులను దూరం చేసే ఈ ఐదు ఆయుర్వేద చిట్కాలు మీకోసం..
వెచ్చటి నీరు గొంతు మరియు స్లేష్మా పొరల్లో తేమను నిలుపుకోవడానికి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచవలసిన అవసరాన్ని ఆయుర్వేదం నొక్కి చెబుతుంది. ఇది వ్యాధి కారక క్రిములకు రక్షణగా పని చేస్తుంది. శరీరం బాగా హైడ్రేట్ అవుతుందని నిర్ధారించడానికి మాత్రం లేత పసుపు రంగులు వచ్చేవరకు తగినంత వెచ్చని నీటిని తీసుకోవాలని చెబుతున్నారు.
కాధా ఆయుర్వేద సమ్మేళనం
కాధ ఇది ఒక్క ఆయుర్వేద సమ్మేళనం, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలను వాటర్ మరిగించడం. ఆంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలతో సమృద్ధిగా ఉండే పసుపు ,లవంగాలు ,అల్లం తులసి ,నల్ల మిరియాలు వంటి వాటిని కాధ లో ఉపయోగిస్తారు. శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో మూలికలు మరియు సుగంధద్రవ్యాలు ఉపయోగపడతాయి. అనేక రకాల జబ్బులను అరికట్టడానికి రోజుకు ఒకసారి తీసుకోవాలి.
యోగ అతి ముఖ్యమైనది మానసిక ఒత్తిడి బాడీ యొక్క రోగ నిరోధక శక్తి పని తీరుని ప్రభావితం చేస్తుంది. ఇది అనేక జబ్బులు బారిన పడేలా చేస్తుంది. ధ్యానంతో ఓత్తిని స్థాయిని అదుపులోకి తీసుకొచ్చుకోవచ్చు మరియు మనసు మరీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోషాలను సమతుల్యంలోకి తీసుకు రావచ్చు. కానీ ఆయుర్వేదం ప్రకారం, యోగ శరీర ఒత్తిడిని పూర్తిగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది, మనసుని ప్రశాంత పరుస్తుంది.