Krithi Shetty : ఉప్పెన సినిమాతో తిరుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అందుకున్న బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాలతోనే గ్రాండ్ సక్సెస్ ని అందుకున్న బేబమ్మ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా సక్సెస్ తో కృతి శెట్టికి అవకాశాలు వరుస కట్టాయి. కుర్ర హీరోలకు బడ్జెట్ సినిమాలకు కృతి శెట్టి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. నాచురల్ స్టార్ బేబమ్మతో “శ్యామ్ సింగరాయ్” సినిమాలో జతకట్టి ఈ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. కాకుంటే ఓటిటి లో మంచి గుర్తింపు వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమాలో కృతి శెట్టి పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోవడంతో ఈ సినిమాలో ఆమె గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. ఇదే క్రమంలో అక్కినేని నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలో జతకట్టింది.
Krithi Shetty : ఈ భామకు అవకాశాలు వస్తున్నాయి కానీ హిట్లు మాత్రం దొరకడం లేదే…
అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. అక్కినేని తండ్రి కొడుకులు కలిసి చేసిన ఈ సినిమా దసరాకు రిలీజ్ కావడంతో ఓ మోస్తారు విజయాన్ని సాధించింది. తరువాత రామ్ పోతినెని సరసన చేసినటువంటి సినిమా “దీ వారియర్” సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఎండి ఖాతాలో మరో ప్లాప్ తోడైంది. ఇదే క్రమంలో ఇప్పుడు సుదీర్ బాబుతో కలిసి చేస్తున్నటువంటి సినిమా ఈ “అమ్మాయి గురించి చెప్పాలి”. ఈ సినిమా రిసల్ట్ ఇవ్వాలో రేపో తెలిసిపోతుంది. ఈ విధంగా చూస్తే కృతి శెట్టి 2021 మరియు 2022లో కలిపి మొత్తం ఆరు సినిమాలు చేసింది. ఇంత తక్కువ కాలంలో ఎన్ని ప్రాజెక్టులు ఏ హీరోయిన్ చేయలేదని చెప్పొచ్చు. కాకుంటే ఈమె ఆశించిన మేర విజయాలు అందుకోలేకపోయింది.
ఉప్పెన సినిమా తర్వాత ఈ అమ్మడుకి కథలో ఎంచుకునే విషయంలో జాగ్రత్త లేదు అంటూ వార్తలు వచ్చాయి. అందుకే ఇంత తక్కువ టైంలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే ఇంకొన్నాళ్ళకు ఈ అమ్మడు టాలీవుడ్ కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి సినిమాలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. నాగచైతన్య వెంకట కాంబినేషన్లో తెరకెక్కుతున్న తెలుగు తమిళ సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. అలాగే తమిళ్ సూపర్ స్టార్ సూర్య బాలా కలయికలో రూపొందుతున్న చిత్రంలో కూడా ఈ బ్యూటీ నటిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల పైనే బేబమ్మ ఆశలన్నీ పెట్టుకుంది. చూడాలి ఈ రెండు సినిమాలు ఈ బ్యూటీ కెరీర్ ని ఎటు వైపు నడిపిస్తాయో.