Vastu Tips : అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలవాలంటే కొన్ని నివారణ చర్యలను పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మన హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. ఆ తల్లిని పూజించడం వలన ఆర్థిక సమస్య లు తొలగిపోతాయని నమ్మకం. అంతే కాదు కుబేరుడు, శుక్రుడు అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారికి అప్పుల బాధలు ఉండవని విశ్వాసం. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని నివారణ చర్యలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా చేసే దానాలకు ఎటువంటి లోటు ఉండదు.
అయితే ఇంట్లో సంపద నిలబడాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి లక్ష్మి హారతి సమర్పించాలి. ఈరోజున స్త్రీలకు తెల్లని స్వీట్లను దానం చేయాలి. ఈ నివారణ చర్యను పాటిస్తే అప్పుల బాధలు తొలగిపోయి పూర్వీకుల ఆస్తి పొందే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అప్పుల బాధనుండి విముక్తి పొందాలంటే శుక్రవారం వేప చెట్టును పూజించాలి. శక్తి మేరకు ఆకలి లేని వారికి అన్నదానం చేయాలి. ఇలా లక్ష్మీదేవిని పూజిస్తూ దానధర్మాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా పొందుతారు. దీంతో మీ అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా మారుతారు.
వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలంటే గులాబీ పువ్వు పై లక్ష్మీదేవి పటాన్ని ఉంచాలి. ఆ తర్వాత రోజు వాటర్ తో అభిషేకం చేయాలి. ఈ పరిహారం వ్యాపార సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే వ్యాపారంలో మంచి ఆదాయం వచ్చేలా చేస్తుంది. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఇబ్బందులు పడుతుంటే రోజు నీటిలో పాలు, నీరు కలిపి చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత డబ్బుల కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఇలా లక్ష్మీదేవి కనుక పూజిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
గమనిక : పైన పేర్కొనబడిన అంశాన్ని వాస్తు శాస్త్రం మరియు వాస్తు నిపుణుల అంచనాల మేరకు రూపొందించాం. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.