Bigg Boss 7 : బిగ్ బాస్ 7 నాలుగో వారం ఎలిమినేషన్…

Bigg Boss 7 : బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఇప్పటికే మూడు వారాలలో ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా నాలుగో వారం కూడా లేడీ కంటస్టెంట్ ఎలిమినేట్ అయింది. హౌస్ లోని హాట్ బ్యూటీ రతిక ఈ వారం ఎలిమినేట్ అయింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో ఎం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో శివాజీ హౌస్ మేట్ గా అనర్హుడని అందరూ తీర్మానించారు. దీంతో బిగ్ బాస్ శివాజీ వద్ద నుండి పవర్ వస్త్రాన్ని తీసేసుకున్నారు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే తనని అనర్హుడు ఎందుకు చేశారు కారణాలు చెప్పాలంటూ శివాజీ కోరడంతో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. దీంతో నాగార్జున శివాజీని అనర్హుడు చేసిన వారిని కారణాలు అడిగాడు. శోభ శెట్టి ప్రియాంక , గౌతమ్ వారి కారణాలు చెప్పగా, ఇక వారు పిచ్చిపిచ్చి కారణాలను చెప్పడంతో నాగార్జున వారికి గట్టిగానే కౌంటర్స్ వేశాడు.

Advertisement

bigg-boss-7-4th-week-elimination

Advertisement

అయితే ఆదివారం ఎపిసోడ్ అంటే గేమ్ కంపల్సరిగా ఉంటుంది. ఈ క్రమంలో ఈసారి బొమ్మ గీయు గెస్ చేయు అనే ఆటను తీసుకొచ్చారు. దీనిలో భాగంగా హౌస్ మేట్స్ ను టీమ్స్ లో విభజించారు. ఈ ఆటలో జట్టులోని ఒకరు వచ్చి బౌల్లో ఉన్న చిట్టి తీసి దానిలో వచ్చిన పేరు ఆధారంగా బోర్డుపై బొమ్మ గీయాల్సి ఉంటుంది. ఇక ఆ వ్యక్తికి సంబంధించిన టీమ్ మెంబర్స్ అతను గీసే బొమ్మ ఆధారంగా పేరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆటలో టీం B ప్రియాంక ,అమరదీప్ ,యావర్ ,శోభ శెట్టి ప్రశాంత్ విజయం సాధించారు. ఇలా ఒకవైపు గేమ్స్ ఆడిస్తూనే మధ్య మధ్యలో టాస్కులు పెడుతూ వచ్చారు బిగ్ బాస్.అలా నామినేషన్ లో ఉన్న ప్రియాంక యావర్ గౌతమ్ శుభశ్రీ , సేవయ్యారు. ఇక చివరిగా ఉన్న టేస్టీ తేజ మరియు రతికను యాక్టివిటీ రూమ్ కి పిలిచి తర్వాత రతిక ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు.

bigg-boss-7-4th-week-elimination

అనంతరం హౌస్ నుంచి స్టేజ్ పైకి వచ్చిన రతీక కన్నీళ్లు పెట్టుకుంది. ఈ క్రమంలో హౌస్ నుండి బయటకు వచ్చేటప్పుడు రతీకకు అందరు ధైర్యం చెప్పారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడు. అనంతరం యావర్ ,శివాజీ ,సందీప్ , శోభ శెట్టి ,తేజ కంటెస్టెంట్లలో ప్రతీకకు నచ్చని లక్షణాలను చెప్పి హౌస్ నుండి బయటకు వెళ్లిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే రతిక నాలుగో వారం ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ గ్లామర్ పరంగా కంటెంట్ ఇచ్చేందుకు ప్రశాంత్ మరియు యావర్ తో ప్రేమగా నటించి చివరికి వెన్నుపోటు పొడవడం ఎవరికి నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఇక రతిక ఎలిమినేషన్ కు ఇదే కారణమని పలువురు చెబుతున్నారు.

Advertisement