Nalgonda : నల్లగొండ తాసిల్దార్ అక్రమఆస్తులు…కోట్లలో నగదు… కిలోలలో బంగారం…

Nalgonda  : నల్గొండ జిల్లా మర్రిగూడ ఎమ్మార్వోగా నిధులను నిర్వహిస్తున్న మంచిరెడ్డి మహేందర్ రెడ్డి అనేే వ్యక్తిపై గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలు ఏసీబీ అధికారులకు తెలియడంతో శనివారం మర్రిగూడ తాసిల్దార్ కార్యాలయం తో పాటు హైదరాబాదులోని వనస్థలిపురం శిరిడి సాయి నగర్ లో ఉన్న ,ఎమ్మార్వో మహేందర్రెడ్డి నివాసం లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 2 కోట్ల అక్రమ నగదు తో పాటు భారీ మొత్తంలో బంగారాన్ని ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

illegal-assets-of-nalgonda-tahsildar-cash-in-crores-gold-in-kilos

Advertisement

నల్గొండ తాసిల్దార్ కార్యాలయంలో మరియు మహేందర్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే దాడులు చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంట్లో ఓ ట్రంకు పెట్ట లభించింది. ఇక దానిని తెరచి చూడగా అందులో దాదాపు రూ.2 కోట్ల కు పైగా నగదు బయటపడింది. అలాగే పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మహేందర్ రెడ్డి కి సన్నిహితులు, బంధువుల ఇండ్లలో మొత్తం 15 చోట్ల ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించగా భారీ మొత్తంలో నగదు బంగారం ముఖ్యమైన ఆస్తి పాత్రాలను పట్టుకోగలిగారు. ఇక మహేందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు ఉండడం గమనార్హం.

illegal-assets-of-nalgonda-tahsildar-cash-in-crores-gold-in-kilos

అయితే మహేందర్ రెడ్డి ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా కందుకూరు తాసిల్దార్ గా పని చేయగా, మూడు నెలల క్రితమే బదిలీ అయి మర్రిగూడకు వచ్చారు. ఇక అక్రమ ఆస్తుల ఆరోపణలు రావడంతో ఎసిబి ఆ అధికారులు అకస్మాత్తుగా దాడి చేయడంతో దాదాపు రూ.4.5 కోట్ల మహేందర్ రెడ్డి అక్రమ ఆస్తులను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకా దీనిపై సోదాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ని అరెస్ట్ చేయగా, సోదాలు ముగిసిన అనంతరం ఏసీబీ కోర్టులో మహేందర్ రెడ్డిని హజరపరుస్తారు.

Advertisement