Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కార్యకలాపాల కారణంగా గత 3 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వకీల్ సాబ్ తో మళ్ళీ సినిమాలలో కి , అడుగుపెట్టాడు. ఇక ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత భీమ్లా నాయక్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు పవర్ స్టార్.

ఈ సినిమాల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మరల ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో తనకెక్కుతున్న హరిహర వీరమల్లు, సినిమా లో నటించబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాను తిరిగి సైట్స్ కి తీసుకెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ తదుపరి షెడ్యూల్ కు సంబంధించిన షూట్ కోసం వర్క్ షాప్ టీం తో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో ఇక మూవీ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభమవుతుందని అందరూ భావించారు కానీ అది జరగలేదు .
జనసేన పార్టీ పనులలో భాగంగా వైజాగ్ లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇక ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభిస్తారు అని అందరు అనుకున్నారు కానీ అది జరగడం లేదు. అయితే మరోసారి క్రిష్ కు పవన్ కళ్యాణ్ షాకు ఇవ్వనున్నాడు అని తెలుస్తోంది. క్రిష్ మూవీ షూటింగ్ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ తమిళ్ రీమేక్ అయిన వినోద సీతమ్ సినిమాలో నటించబోతున్నాడట. ఈ మూవీ షూటింగ్ కోసం నవంబర్ నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా కోసం కేవలం 20 రోజులు మాత్రమే పవన్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాతే హరిహర వీరమల్లుని పవన్ కళ్యాణ్ చేయబోతున్నట్లుగా సిని ,ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలతో పాటు డివీవీ దానయ్య నిర్మించబోతున్న తేరీ సినిమా రీమేక్ కూడా చాట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమా రిమేక్ కు సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవడంతో సుజిత్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడట. పవన్ కళ్యాణ్ డేట్స్ దొరికిన వెంటనే ఈ సినిమా షూటింగ్ కూడా పట్టాలెక్కని ఉంది.