Zodiac Signs : జులై నెల 2022 తులా రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం.. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభంలో బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. కలిసివుండి రెండవ తేదీ నుండి మిధునంలోకి చేరుకుంటాడు. ఇలా చేరుకున్న తర్వాత 17వ తేదీ వరకు అక్కడే ఉండి. తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని ఉండకుండా కుంభంలోనికి వచ్చి అక్కడ నుండి మళ్ళీ మకరంలోకి వస్తాడు. అదేవిధంగా మీనంలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.
తులా రాశి వారికి చూసుకున్నట్లయితే ఎప్పటినుంచో కొన్ని కలలు కంటూ ఉంటారు. ఆ కలలు ఇప్పుడు ఈ మాసంలో అవి నెరవేరుతాయి. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా డబ్బులు ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దేవుడు భక్తి వల్ల జ్ఞానం కలిగేలా కనిపిస్తుంది.ఈ తులా రాశిలో చిత్త ,స్వాతి ,విశాఖ నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే వీరికి విదేశా సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వివాహ సంబంధించిన విషయాలలో కొద్దిగా ఒత్తిడిలు పెరుగుతాయి. స్వాతి నక్షత్రం వారికి , స్వాతి నక్షత్రం వారికి మీ యొక్క భాగస్వామిని విదేశాలకు పంపించాలి. అనే ప్రయత్నాలు నెరవేరుతాయి.
Zodiac Signs : తులా రాశి వారికి జులై నెల 2022 గోచార రాశి ఫలాలు అదేవిధంగా గ్రహసితి ఎలా ఉన్నాయంటే…

కొన్ని సామాజిక విషయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి: రుణ సంబంధించిన, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు చక్కగా సాగుతాయి. ఈ రాశి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ధన రాబడి విషయాలలో మంచి అనుకూలత కనబడుతుంది. అయితే డబ్బు ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తి సంబంధించిన విషయాలు కు మంచి అనుకూలత కనబడుతుంది. అలాగే నల్ల రేగడి మట్టి ఉన్న రైతులకి మంచిగా కలిసి వస్తుంది. అయితే ఈ రాశి వారికి అన్ని పనులలో అనుకూలత పొందాలంటే.ఈ తులా రాశి వారు చేయవలసిన ఆరాధన: విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర యొక్క నామాలు లేదా కాలిక దేవి మాతకు పూజ చేసుకోవచ్చు. అలాగే గోవులకు పిడకడు బెల్లం, గ్రాసం తినిపించవచ్చు. ఇలా చేయడం వలన అన్ని మంచి ఫలితాలను పొందుతారు.