Pooja tips : ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం. డబ్బుతోనే అన్ని పనులను పూర్తి చేయగలుగుతాం. డబ్బుకు అంత విలువ ఉంది. డబ్బు కోసమని కొందరి దగ్గర అప్పుగా తెచ్చుకుంటుంటారు. దానిని తిరిగి ఇచ్చేటప్పుడు ఎన్నో బాధలను అనుభవిస్తారు. కనుక డబ్బును ఒకరి దగ్గర ఒకసారి తీసుకున్నామంటే తిరిగి ఇవ్వడం కష్టమే. ఈ సమస్య నుంచి బయటపడటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. కొంతమంది మాత్రమే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. అయితే ఈ అప్పుల బాధ నుంచి విముక్తి పొందటానికి ఒక ఉపాయం కూడా ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దీపావళి పర్వదినాన ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని కొలుస్తారు. ఆరోజున అప్పుల బాధతో ఉన్నవారు దీపావళి రోజున అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఐదు గులాబీ పువ్వులను తెచ్చుకోవాలి. తర్వాత ఒకటిన్నర పొడవున్న తెల్లటి వస్త్రాన్ని తీసుకొని మీ ముందు పరుచుకోవాలి. తర్వాత ఐదు గులాబీ పువ్వులను గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్కటిగా ఆ తెల్లటి వస్త్రంలో వేయాలి. ఆ విధంగా తయారు చేసుకున్న దానిని భద్రంగా ఎవరు తిరగనిచోట దాచిపెట్టుకోవాలి. ఇలా చేయడం వలన మీరు అప్పుల బాధ నుంచి త్వరగా విముక్తి పొందుతారు
Pooja tips : అప్పుల బాధలు తీరాలంటే లక్ష్మీదేవిని ఇలా ప్రసన్నం చేసుకోండి…

అలాగే లక్ష్మి కటాక్షం పొందాలంటే ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చొని పదివేల సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని సూర్యోదయంలోపే జపించి ముగించుకోవాలి. నెయ్యితో పదివేల సార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే చంద్రికా రుక్మిణీ ప్రసన్నం పొంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ మంత్రం ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు జపించకూడదు. అన్ని విధాలుగా పవిత్రంగా ఉండేవారు మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలి. అటువంటి వారికే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇతరులు ఎవరు చేసినా ఫలితం శూన్యమే అవుతుంది. ఇంతకీ లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏ మంత్రాన్ని జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ‘శంకిని యక్షిణి సాధన మంత్రం శంఖం దారడి శంఖ ధరణి హ్యీమ్ హ్యీమ్ క్లీమ్ శ్రీ స్వాహా’