Beauty Tips : శనగపిండిని వంటల్లోనే కాదు, మన చర్మం అందంగా కావడానికి కూడా ఉపయోగపడుతుంది. శనగపిండి వలన మన చర్మం అందంగా, ప్రకాశంవంతంగా తయారవుతుంది. అలాగే వివిధ రకాల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. శనగపిండి లో ఉండే ఫైబర్, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, చక్కెర, కాల్షియం, విటమిన్ ఏ, పొటాషియం ,రాగి, జింక్, ఫాస్పరస్ వంటి విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి మనకు కలిగే అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.ముఖ్యంగా శనగపిండితో సులువుగా మన మొహాన్ని అందంగా, కాంతివంతంగా తయారుచేసుకోవచ్చు.
వివిధ రకాల ఆయింట్ మెంట్ లు మొహానికి వాడే బదులు ఎటువంటి హాని కలగని ఈ శనగపిండితో మీ ముఖాన్ని అందంగా తయారు చేసుకోండి. అయితే ఇప్పుడు మీ ముఖానికి ఎలా ఫేస్ ప్యాక్ వేసుకోవాలో తెలుసుకుందాం. కొంతమందికి చర్మం జిడ్డుగా ఉంటుంది. అలాంటివారు శనగపిండితో మీ ముఖంపై ఉన్న జిడ్డును సులువుగా తొలగించుకోవచ్చు. అది ఎలాగంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా శనగపిండితో మీ చర్మాన్ని రుద్దుకోవడం వలన జిడ్డు తొలగిపోయి ముఖం సున్నితంగా, అందంగా, ప్రకాశవంతంగా, తయారవుతుంది.
Beauty Tips : ఈ పిండితో ఫేస్ ప్యాక్ వేసుకున్నారంటే… మీ అందం ఇంకా పెరుగుతుంది…

అలాగే ఒక స్పూన్ శెనగపిండిలో కొద్దిగా తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ఒక పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును మొహానికి రాసుకొని ఒక అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన మీ ముఖంలో మంచి గ్లో వస్తుంది. తేనె కు బదులుగా ఆవు పాలు కూడా వేసుకోవచ్చు. పేస్ట్ లాగా చేసుకునే ముఖానికి రాశామంటే ముఖంలో జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా, తయారవుతుంది. అలాగే శనగపిండిలో కొద్దిగా పెరుగును వేసుకొని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి.
15 నిమిషాలు తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు మూడు సార్లు వేసుకోవాలి.శనగపిండిలో కొద్దిగా పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా పసుపు పొడిని వేసి బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకొని అది పూర్తిగా ఎండిపోయేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మీ ముఖంపై ఉన్న మొటిమలు, డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.
అలాగే ముఖం కూడా అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ను వారానికి నాలుగు లేదా ఐదు సార్లు రాసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. అలాగే శనగపిండిలో ఒక గుడ్డు తీసుకొని అందులోని తెల్లసొన వేసి బాగా కలిపి పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకొని ఒక అరగంట దాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం అందంగా తయారవుతుంది.