Zodiac Signs : కర్కాటక రాశి వారికి జులై నెల 2022 గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం…

Zodiac Signs : జులై నెల 2022 కర్కాటక రాశి గ్రహస్థితి అలాగే గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.. ఈ నెలలో మేషరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభంలో బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. కలిసి ఉండి రెండో తేదీ నుండి మిధున రాశిలోకి చేరుకుంటారు. అలా చేరుకున్న తర్వాత 17వ తేదీ వరకు అక్కడే ఉండి తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని ఉండకుండా కుంభంలోనికి వచ్చి అక్కడ నుంచి మళ్లీ మకరంలోకి వస్తుంది.

అలాగే మీనరాశిలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది. కర్కాటక రాశి వారి రాశిలో చంద్రుడితో మొదలవుతుంది రాసి మీద గురువు యొక్క దృష్టి కూడా ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ సంబంధించిన విషయాలలో బిజినెస్ సంబంధించిన విషయాలలో ఇలాంటివన్నీట్లో అనుకూలత కనిపిస్తుంది. కొన్ని ఆగిపోయిన పనులు మళ్లీ ఈ మాసంలో జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయం వారు ఒత్తిడిలకు గురవుతారు. సడన్గా మానేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇలాంటివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒత్తిడి తగ్గాలి అంటే విష్ణు సహస్రనామం వినడం వలన మీ ఒత్తుడులు తగ్గుతాయి.

Zodiac Signs : కర్కాటక రాశి వారికి జులై నెల 2022 గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం…

horoscope July 2022 Zodiac Signs for Cancer
horoscope July 2022 Zodiac Signs for Cancer

అయితే ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, అశ్లేష ఉంటాయి. పునర్వసు నక్షత్రం వారికి ముఖ్యంగా కొత్తగా చేసే ప్రయత్నాలు పలిస్తాయి. పుష్యమి నక్షత్రం వారికి రాజకీయం వారు కావచ్చు కుటుంబ గొడవలు కావచ్చు ఇవన్నీ తొలగిపోయి, ఈ మాసంలో అంతా మంచే జరుగుతుంది. ఈ పుష్యమి నక్షత్రం వారు మాటలు అందరినీ హత్తుకునేలా ఉంటాయి. అశ్లేష నక్షత్రం వారు కి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గవర్నమెంట్ విషయాలలో, బిజినెస్ విషయాలలో చాలా బాగా దూసుకుపోతూ ఉంటారు. ఇబ్బందులు అనారోగ్య సమస్యలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది.

ఈ కర్కాటక రాశి వారు విదేశాలు వెళ్లి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఏదైనా కన్స్ట్రక్షన్ విషయాలు మొదలు పెట్టేటప్పుడు ఆచితూచి అడిగేయడం మంచిది. కన్స్ట్రక్షన్స్ పనులు మొదలుపెట్టేటప్పుడు గణపతి పూజ చేసి మొదలుపెట్టడం వలన అంత మంచి జరుగుతుంది. అలాగే రైతులు పంటల విషయాలు మొదలు పెట్టేటప్పుడు కూడా గణపతి పూజ చేసి మొదలుపెట్టడం మంచిది.

అలాగే విద్యార్థులు కూడా జాగ్రత్తలు వహించారు. సంతానం లేనివారు సంతాన విషయాలలో కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ఈ కర్కాటక వారు అన్ని మంచి ఫలితాలని పొందాలంటే.. ఈ కర్కాటక రాశి వారు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆరాధన అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి అలాగే గోవులకు బెల్లం ఉండలు క్యారెట్లును తినిపించడం వల్ల ఒత్తిడిలు అన్ని తొలగిపోతాయి.