Pooja tips : ఆషాడ మాసంలోనే ప్రారంభమయ్యే ఈ తొలి ఏకాదశి రోజున మహా విష్ణువు కొలువై ఉంటాడు. తొలి ఏకాదశిని పూర్వకాలంలో సంవత్సర తొలి అడుగుగా పరిగణించేవారుట. మహా విష్ణువు ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే ఏకాదశి నా యోగనిద్రలోకి వెళతాడు. మహావిష్ణువు నిద్రకు ఉపక్రమించే రోజు కావున దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగారం చేసి మరుసటి రోజు ద్వాదశి ఉదయం విష్ణుని కొలిచి ఆ తరువాత ప్రసాదాలను తీసుకుని భోజనం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
తొలి ఏకాదశి రోజున నిద్రపోయే విష్ణుమూర్తి మరలా నాలుగు నెలల తర్వాత కార్తిక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి బయటకు వస్తాడు. ఏకాదశి మొదటి పేరు ఎలా వచ్చింది. కృతయజ్ఞంలో బ్రహ్మ వరంతో దేవతలను ,రాక్షసుడు వేధించాడని కథ ఒకటి ఉంది. మహావిష్ణువు రాక్షసులతో పోరాడి అలసిపోయి ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకుండగా స్వామివారి శరీరం నుంచి కన్య కనిపిస్తుంది. అప్పుడు ఆ కన్య ఆ రాక్షసుడిని అంతం చేయండి అని చెప్పింది. అప్పుడు మహావిష్ణువు కు సంతోషం కలిగి ఆ కన్యను ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు.
Pooja tips : తొలి ఏకాదశి విశిష్టత.. మహా విష్ణువుని ఎలా కొలవాలి

అప్పుడు ఆ కన్య తాను విష్ణు ప్రియ గా పూజలు అందుకోవాలని కోరింది. ఆ రోజు నుండి ఏకాదశి తిధిగా వచ్చిందని చెబుతారు. ఏకాదశి అనగా పదకొండు. కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు మనసు కలిపి మొత్తం పదకొండు. మనిషి వీటన్నిటిని తన ఆధీనంలోకి తెచ్చుకొని, పూజ సమర్పించాలి, ఇలా చేయడం వల్ల రోగాలు దరిచేరకుండా ఉంటాయని అంటారు. ఈ నాలుగు నెలలు ఎంతో పద్ధతిగా చతుర్మాస్యదిక్షణం చేస్తారు. ఈ నాలుగు నెలల పాటు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుభ్రమై శరీరం నూతన ఉత్తేజితాన్ని సంతరించుకుంటుంది.
మనకు ఆపద వచ్చిన సమయంలో ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ ఉపవాసాలు ఆచరించాలి. దీనివల్ల కోపం పూర్తిగా నివారింపబడుతుంది. తొలి ఏకాదశి రోజున పేలపిండిని చేసి విష్ణుకి ప్రసాదంగా పెడతారు. ఈ పేలాలో బెల్లం ,యాలకులు వేసి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా విష్ణువుని తీర్థప్రసాదాలతో, భక్తి శ్రద్ధలతో, ఉపవాసం తో శ్రీ మహావిష్ణువుని కొలిస్తే ఆ ఇంట్లో ధనం, ఆరోగ్యం చిరకాలం ఉంటుంది.