Vastu tips : మీరు ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా. ఏ పని చేయాలన్నా చిరాకుగా ఉందా. తీవ్రమైన మానసిక శాంతి లో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాస్తు దోషాల ప్రభావం అయ్యి ఉండొచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వస్తువుల మరిక వంటి అనేక అంశాలు ప్రభావం చేస్తున్నాయని శాస్త్రజ్ఞులు తెలియజేశారు. వెలుతురు, గాలి రాని ఇళ్లలో కుటుంబ సభ్యులు అనారోగ్యం క్షీణిస్తుంది.
కిటికీలను తెరవకుండా ఉంచడం వాస్తు దోషమని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కిటికీలను ఎప్పుడు తెరవకుండా ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అనారోగ్య బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉన్న గాలి బయటికి పోక, బయట ఉన్న ఆక్సిజన్ లోపలకి రాక, గాలి వెలుతురు లేని ఇంట్లో అనారోగ్యం బారిన పడతారని, అందుకే ఎల్లప్పుడూ కిటికీలు తెరిచే ఉంచాలని సూచిస్తున్నారు.
ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంటే కష్టమే.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణానికి ఏ విధంగా అయితే నియమాల అవసరము ఆ ఇంట్లో జీవించే విధానానికి అంతే అవసరం. చాలామంది ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకున్నామని, అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. అయితే ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకోవడం మాత్రమే కాదు. తధానుగుణంగా ఇంటిని ఉపయోగించడం కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. చాలామంది ఇంటికి ఉన్న కిటికీలు, తలుపులు ఎల్లప్పుడూ తెరవకుండానే మూసి ఉంచుతారు. కొన్ని ఇళ్లల్లో సంవత్సరాల తరబడి కిటికీలు మూసి వేయబడి ఉంటాయి. కిటికీలు తెరిస్తే ఇంట్లోకి దుమ్ము వస్తుందని చాలామంది కిటికీలను తెరవడానికి ఇష్టపడరు. అయితే ఇలా ఉంటే రోగాలకి గురికావాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు.
Vastu tips : . అయితే ఇదే కారణం కావచ్చు

గాలి, వెలుతురు బాగా వస్తేనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ…
ఇక అదే సమయంలో ఇంట్లోకి గాలి వెళుతూరి వస్తేనే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. గాలి వెలుతురు రానీ ఇళ్లల్లో నెగటివ్ ఎనర్జీ చేరుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎల్లప్పుడూ ఇంటి లోపల, బయట లైటింగ్ ఉండేలా చూసుకోవాలి చీకట్లో ఉన్న ఇంట్లో ఎప్పుడు కుటుంబ సభ్యులు జబ్బులు బారిన పడి ఆందోళనలో ఉంటారు. ఇక ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి కచ్చితంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, గాలి వెలుతురు వచ్చేలా ఉంచుకోవాలని చెబుతున్నారని నిపుణులు.
బాల్కనీ ఉంది అందుకే వినియోగించుకోండి..
ఇంట్లో ఉన్న బాల్కనీకి వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది బయట కూర్చోటానికి ఇష్టపడరు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ అనారోగ్యానికి కొని తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. కానీ బాల్కనీలో ఉన్న ఇంట్లోని వారు, అప్పుడప్పుడు బయట కూర్చోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేశారు. బయట కూర్చున్నప్పుడు వెలుతురు, గాలి వస్తుందని, సూర్యకాంతి మన పైన పడటం వల్ల మనకు కావాల్సిన డి విటమిన్ పుష్కలంగా లభిస్తుందని, అప్పుడు ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. అందుకే బాల్కనీలో కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలని సలహా ఇస్తున్నారు