Sandalwood Benefits : మెరిసే చర్మం కోసం కొన్ని సంవత్సరాలుగా చందనాన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఆయుర్వేదంలో కూడా చందనాన్ని ఉపయోగిస్తారు. ఈ చందనాన్ని రాసుకుంటే చలవచేసి… తలనొప్పి దూరమవుతుందని నమ్ముతారు. ఈ చందనాన్ని శాంటాలమ్ జాతికి చెందిన మొక్కల నుంచి వచ్చే కలప ద్వారా దీనిని తయారు చేస్తారు. ఈ మొక్కను మన తెలుగు రాష్ట్రాలలో గంధపు చెట్లు అని అంటారు. చందనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్బవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చందనం ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం..
చందనంలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి.
శాండిల్ వుడ్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ ఎఫెక్ట్స్, సూథి గ్ ఎఫెక్ట్స్ వంటివి మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అందువల్ల నిద్ర లేని సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు తలెత్తవు. చర్మానికి మృదుత్వాన్ని, మెరుపు అందించడంలో చందనం అద్భుతంగా పనిచేస్తుంది. చందనంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి మీకు ఇన్ఫెక్షన్లలో రాకుండా అడ్డుకుంటాయి.
Sandalwood Benefits : చందనంతో కలిగే ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఇవే….

అంతేకాకుండా ఇవి అల్సర్ చికిత్సలో కూడా ఉపయోగపడతాయి. గుండెన ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి చాలా చక్కగా పనిచేస్తుంది. మధుమేహాన్ని నియంతరించడంలో సహకారిగా ఉంటుంది. చందనంలో ఆల్ఫా శాంటా లోలల్ అనే రసాయనం ఉంటుందని… ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. గంధపు చెక్క చర్మ కాన్సర్ రాకుండా వ్యతిరేకంగా పోరాడడంలో బాగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తెలిసింది.
చందనం దుష్ఫవాలు..
చందనం వల్ల మూత్రపిండాలు దెబ్బ తినడం, దురద మూత్రంలోని రక్తం రావడం అంటే సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యులు సలహా తీసుకోవాలి.