Vastu Tips : పసుపు అంటే ఇందు సాంప్రదాయంలో ఎంతో ప్రీతికరమైనది. దీన్ని కేవలం వంటకాలలో కాకుండా శుభకార్యాలలో కూడా వాడుతూ ఉంటారు. ఈ పసుపులో యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుని కలగజేస్తుంది. ఎంతో అద్భుతమైన ఈ పసుపు లో ప్రత్యేకత ఉంది. దీనివలన మీ జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. పసుపుతో పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి ఆనందించి మీపై ధనం వర్షం కురిపిస్తుంది. డబ్బు లోపం నుండి నివారణ: లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎప్పుడు ధనం కి లోటు లేకుండా ఉండాలంటే..
మీరు గురువారం నాడు ఐదు పసుపు కొమ్ములను తీసుకుని ఎర్రటి వస్త్రంలో కట్టి మీరు ధనం పెట్టే ప్రదేశంలో దీనిని పెట్టండి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనవర్షం కురిపిస్తుంది. దీనిని ప్రతి నెల పవిత్ర స్థలంలో పాతి పెట్టండి. ఆగిపోయిన పనులు జరగాలంటే… శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం పొందడానికి గురువారం రోజు పసుపుతో బ్రాహ్మణులకు పసుపు వస్త్రాలు, సెనగపప్పు, అలాగే సెనగపిండి లడ్డూను దానం ఇవ్వండి. అలాగే గురువారం రోజు అరటి డోప్పలో పసుపును నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆగిపోయిన పనులు జరగడం మొదలవుతాయి.
Vastu Tips : ఇంట్లో ఆర్థిక పరిస్థితి చక్కబడాలి అంటే.. ఈ పసుపుతో ఇలా చేయండి చాలు…

అలాగే మీరు గురువారం ఎటువంటి శుభకార్యానికైన వెళుతున్నట్లయితే వినాయకుడి నుదిటిన పసుపు పుసి కుంకుమ పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన మీ పనులలో వచ్చే అడ్డంకులు పోతాయి. మీ జాతకంలో బృహస్పతి మెరుగుపడాలంటే… గురువారం రోజు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు దాంతో లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా పొందవచ్చు. ఆ రోజున బృహస్పతిని కూడా పూజిస్తారు. పసుపు బృహస్పతికి సంబంధించినదిగా భావిస్తారు గురువారం రోజు పసుపుతో ఈ విధంగా చేయడం వలన మీ జాతకంలో బృహస్పతి స్థానం మెరుగుపడుతుంది