Roasted Flex Seeds : అసలు అంటే అందరికీ ఇష్టం ఉండదు. కానీ ఈ గింజల వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే వీటిని పచ్చిగా తినడం కంటే వేయించి తీసుకోవడం వలన ఎక్కువ లాభాలు అందుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం… ఈ అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తాయి కాబట్టి చాలామంది తీసుకుంటూనే ఉంటారు. ఇవి జిగటగా ఉండడం వలన అందరూ వీటిని తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ గింజలను వేయించి తీసుకోవచ్చు.. ఈ గింజలు పెనంపై వేసి కాస్త వేయిస్తే మంచి తీపి ఆరోమా వస్తుంది. అప్పుడు మంచిగా తీసుకోవచ్చు.. అలా తీసుకుంటే వాటి రుచి చాలా బాగుంటుంది. అలాగే సులభంగా తినేయొచ్చు. వేయించిన అవిసె గింజలు శరీరానికి పోషకాలను పుష్కలంగా అందజేస్తుంది. అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ అవిసె గింజలు ఒక స్పూను దాదాపు 37 క్యాలరీలు కలిగి ఉంటుంది. ఇందులో రాగి, జింకు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ గింజలు మన శరీరానికి బూస్ట్ ల ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ప్రోటీన్ ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరంలో ఎనర్జీ స్థాయిని పెంచడంలో ఉపయోగపడుతుంది. వీటిని శాన్విచ్లలో కూడా వాడుకోవచ్చు. ఈ గింజలలో ఒమేగా త్రీ ఒమేగా 6 యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచి మెదడుకు పదును పెట్టడానికి చాలా మేలు చేస్తాయి. వేయించిన అవిసె గింజలను నిత్యము రెండు సార్లు తినడం వలన శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తపోటు సహజ స్థాయికి చేరుతుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అధిక బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని డైట్ లో ఆడ్ చేసుకోవడం వలన మంచి మేలు జరుగుతుంది. వీటిలో ఉండే ఫైబర్ శరీరంలోని జీరాక్రియలను నియంత్రించడం ద్వారా వేగంగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
Roasted Flex Seeds : అవిసె గింజలు తీసుకుంటే… మీ బాడీలో ఈ అద్భుతాలు జరిగినట్టే…

నిత్యము ఆహారం తీసుకున్న తర్వాత ఒక చెంచాడు వేయించిన అవిసె గింజలను తీసుకోండి. ఈ విధంగా అవిసె గింజలను రోజు తీసుకోవడం వలన ఉదరానికి మంచి మేలు జరుగుతుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన, మలబద్దకం, కడుపునొప్పి, ఎసిడిటీ లాంటి సమస్యల నుండి దూరం చేస్తాయి. కాబట్టి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఈ గింజలలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి ఇవి దెబ్బతిన్న చర్మ కణాలను తొలగించడం ద్వారా చర్మానికి రాడికల్స్ లేకుండా చేస్తాయి. అలాగే జుట్టుకి మంచి మేలుని అందిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగి మెరిసేలా చేస్తాయి. వీటిని నిత్యము పడుకునే ముందు వేయించిన పొడిని పాలలో కలిపి తీసుకుంటే నిద్రలేని సమస్య దూరం అవుతుంది. దీనిలో ఉండే పోషకాలు తో సహా మెగ్నీషియం కూడా శరీరంలో సెరోటోనిక్ హార్మోన్ ని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోవచ్చు