Hair Fall Tips : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పులు వలన జుట్టు రాలే సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉన్నది. ఇది వయసు తరహా లేకుండా, అలాగే మగవారిలో కూడా ఈ సమస్య అధికమవుతుంది. దానికోసం ఎన్నో షాంపులను, ఆయిల్స్ వాడి అలసిపోయి ఉంటారు. కానీ ఆ సమస్య నుండి ఉపశమనం కలిగి ఉండదు. ఇక దీనికోసం ట్రీట్మెంట్ అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఇంట్లోనే ఒక రెమెడీతో జుట్టు రాలే సమస్యకి చెక్ పెట్టవచ్చు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.దీనికోసం రెండు స్పూన్ల వేపాకు పొడి, రెండు స్పూన్ల ఉసిరికాయ పొడి, రెండు స్పూన్ల మెంతిపొడి, రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.
Hair Fall Tips : జుట్టు రాలే సమస్యకి ఇంట్లోనే హెయిర్ ప్యాక్ తయారు చేసుకోండి ఇలా…
ఈ మిశ్రమాన్ని తలకి అప్లై చేసి 30 నిమిషాల వరకు ఉంచుకొని తరువాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒక సారి అప్లై చేసుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.మనం పైన మిశ్రమంలో వాడిన వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండడం వలన జుట్టులో దురద, చుండ్రు తగ్గిస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని ఆపుతుంది.మెంతి పిండిలో నికోటిన్ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అలాగే పెరుగు. దీనిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి.

ఇది మాడు పైన శుభ్రపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉసిరి పొడి. ఇది తెల్ల జుట్టు రావడం లాంటి సమస్యలు, జుట్టు రాలడం లాంటి సమస్యల నుండి రక్షిస్తుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటే వారంలో రెండుసార్లు అప్లై చేసుకుంటే ఈ సమస్య రోజురోజుకి తగ్గిపోతుంది. ఈ టిప్ ని చిన్న వయసు వారి నుండి పెద్ద వయసు వారి వరకు వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.