Vastu Tips : చాలామంది ఎన్నో రకాల మొక్కలను ఇంట్లో నాటుతారు. కానీ వాటిని నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం మాత్రం తెలియదు. ఇంటికి వాస్తు ఎంత అవసరమో.. ఇంట్లో నాటే మొక్కలు కూడా వాస్తు నియమాలు అంతే అవసరం. ఇంట్లో మొక్కలను నాటేటప్పుడు కొన్ని వాస్తు నిమాలను ఎంపిక చేసుకుంటే ఆ ఇంట్లో ఉండే అనుకూల ఫలితాలు కారణంగా మారుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పాలికారే ముక్కలు ఉండడం అంత మంచిది కాదు. బోన్సా స్ మొక్కలు, కాక్టిస్, పత్తి మొక్కలు నాటకం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఇవే కాకుండా వాస్తుకు అనుకూలంగా లేని మొక్కలు, చెట్లు పెంచడం భార్యాభర్తల మధ్య గొడవలు, ధన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇల్లు ప్రారంభించేటప్పుడు స్థలం ఆవరణంలో జమ్మి చెట్టు ఉంటే వెంటనే తీసివేయాలి. ఇంట్లో జమ్మి చెట్టు ఉండడం కీడు ప్రభావం ఏర్పడుతుంది. ఈ చెట్లు ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతాయి. చిన్న చిన్న కారణాలకు పెద్ద సమస్యలు ఏర్పడతాయి.
కాబట్టి ఇంటిదగ్గర జమ్మి చెట్టు ఉండడం అంత మంచిది కాదు.చింత చెట్టు ఇంటి సమీపంలో ఉండడం మంచిది కాదు. ఈ చెట్టును అశుభ సూచికంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దుష్టశక్తులకు నిలయంగా కూడా పనిచేస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటిని కొనాలనుకునేవారు పక్కన చింత చెట్టు ఉన్నట్లయితే దాని కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. చింత చెట్టు ఇంటి సమీపంలో ఉంటే, ఇంట్లో ఉంటే ఆ కుటుంబంలోనే అన్ని చింతలే ఉంటాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.గోరింటాకు మొక్క అందరు ఇండ్లలో ఉంటుంది. కానీ ఈ మొక్క ఇంట్లో ఉండడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, కుటుంబంలోని సభ్యులు ప్రశాంతంగా జీవించలేరని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే వెదురు మొక్క ఇంట్లో నాటడం మంచిది కాదు. లక్కీ ఎదురు మొక్క అదృష్టాన్ని ఇస్తే, అన్యదేశ ఎదురు మొక్క అనారోగ్యానికి గురిచేస్తుంది. చాలామంది ఎదురు మొక్కను ఇంటి చుట్టూ రక్షణ కోసం పెంచుతూ ఉంటారు. ఇంటి చుట్టూ వెదురు మొక్క ఉండటం వల్ల కుటుంబానికి ధన సమస్యలు కలుగుతాయి. ఇక మరణం సమయంలో హిందూమతంలో వెదురును ఉపయోగిస్తారు.
Vastu Tips : ఈ చెట్లు మీ ఇంట్లో ఉన్నట్లయితే… భార్యాభర్తల మధ్య కలహాలు, ధన సమస్యలు.

ఇక వెదురు ను అనారోగ్యంతోను, మరణంతో ముడిపడి ఉంటుంది.రావి చెట్టు దేవాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని ఇళ్లలో పెంచుకోవడం ఏ మాత్రం శ్రేయస్సు కరం కాదు. రావి చెట్టుని పవిత్రమైన స్థలంలో కానీ, గుడిలో కానీ నాటాలి అని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలా కాకుండా రావి చెట్టుని ఇంట్లో నాటినట్లయితే ఆర్థిక సమస్యలు సంభవిస్తాయి.ఖర్జూరం చెట్టు రోజు ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతుంది. దీనివల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయని అంటున్నారు. కొన్ని శాస్త్రాల ప్రకారం ఖర్జూర చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది.ఇంటి ఆవరణంలో కుళ్ళిపోయిన లేదా ఎండిపోయిన ముక్కలను ఉంచడం అంత మంచిది కాదు. ఇంట్లో ఉండే ప్రతి మొక్క పచ్చగా మరియు తాజాగా, పువ్వులు మరియు పండ్లను కలిగి ఉండాలి. ఎండిపోయిన మరియు కుళ్ళిపోయిన మొక్కలను, లు పండ్లు ఇవ్వని మొక్కలను ఇంట్లో నుంచి వెంటనే తీసివేయాలి. ఎండిపోయిన పువ్వులు కూడా అశుభని కలగజేస్తాయి కాబట్టి వీటిని కూడా వెంటనే తీసివేయాలి. ఇంట్లో మొక్కలను నాటాలనుకున్న వారు ఈ నియమాలు పాటిస్తూ, మొక్కలను పెంచితే మంచిది.