Whatsapp : ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వారి పర్సనల్ అండ్ వర్క్ చాటల కోసం వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మేట యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ వినియోగదారులను వివిధ పరికరాలలో ఏకకాలంలోనే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. దీనివలన ఏకకాలంలోనే వివిధ రకాల పరికరాలలో వాట్సాప్ ను చూడవచ్చు. అయితే ఆఫీస్ సెట్టింగ్ లో డెస్క్ టాప్స్ లో మీరు వాట్సాప్ ను వినియోగిస్తున్నప్పుడు ఎవరైనా మీ స్క్రీన్ చూస్తే కాస్త అసౌకర్యానికి గురికాక తప్పదు.
ఇక పని చేసే సమయంలో డెస్క్ టాప్ నుండి వాట్సప్ వినియోగించేటప్పుడు మన ప్రైవేట్ చాట్ లను ఎవరైనా చూస్తే కాస్త ఆందోళన పడటం సర్వసాధారణం. అయితే చాలామందికి అలా కనిపించకుండా ఉంటే బాగుండు అని ఆలోచన కూడా వచ్చే ఉంటుంది. ఈ క్రమంలోనే దీనిని నివారించడానికి చాలామంది పర్సనల్ చాట్లను డిలీట్ చేయడం లేదా డెస్క్ టాప్ లలో యాప్ ని ఉపయోగిస్తున్నప్పుడు సున్నితమైన సంభాషలను నివారించడం వంటి పనులు చేస్తుంటారు. కానీ వీటన్నిటి కంటే కూడా WA వెబ్ ప్లస్ అని వెబ్ ఎక్స్టెన్షన్ దీనికి పరిష్కారం అని చెప్పాలి. మరి దీనిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* దీనికోసం ముందుగా క్రోమ్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి WA Web Plus For Whatsapp అని సెర్చ్ చేయండి…
- Add to chrome అనే ఆప్షన్ క్లిక్ చేయండి..
- అనంతరం బ్రౌజర్ ని మూసివేసి మళ్ళీ ఓపెన్ చేయండి.
- ఇప్పుడు google chrome లో whatsapp వెబ్ కు లాగిన్ అవ్వండి.
- ఇక దీనిలో మీరు చాట్ లను హైడ్ చేసుకోవడం బ్లేర్ చేసుకోవడం వంటి ఆప్షన్స్ చూడవచ్చు.
- ఇలా మీరు పని చేసే సమయంలో మీ పర్సనల్ డేటాను ఇతరులు చూడకుండా కాపాడుకోవచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది మీ అవగాహన కోసం మాత్రమే..