Health Tips : వానాకాలం వచ్చిందంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ కాలంలో వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా మనల్ని వేధిస్తాయి. ఈ వైరల్ ఫీవర్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఇది ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. అందుకే మనం బయటికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకు ఎటువంటి అనారోగ్యం వచ్చిన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే దేనినైనా తట్టుకోగలుగుతారు. ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒక డ్రింక్ బాగా పనిచేస్తుంది.
మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వస్తాయి. ఈ సమస్యలన్నింటికీ ఇప్పుడు మనం తయారు చేసుకునే డ్రింక్ చెక్ పెడుతుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం… ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు వరకు నీరు తీసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ముక్క కచ్చాపచ్చాగా దంచుకుని ఆ నీటిలో వేయాలి.
అలాగే ఒక బిర్యాని ఆకు, మూడు లేదా నాలుగు మిరియాలు, మూడు లవంగాలను కచ్చాపచ్చాగా దంచుకొని నీటిలో వేయాలి. ఇక చివర్లో బ్లాక్ సాల్ట్ ను చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి బాగా మరిగించాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ డ్రింక్ ని మూడు భాగాలుగా చేసుకుని ఉదయం ఒక కప్పు, మధ్యాహ్నం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడం వలన శరీరంలో వ్యర్ధ పదార్థాలు అన్నీ తొలగిపోయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వానాకాలంలో వచ్చే వైరల్ ఫీవర్లను ఈ డ్రింక్ ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని మీ అవగాహన మీరకు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం.యువతరం దీనిని ధ్రువీకరించలేదు