Good Health : ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలను నిత్యం పాటించండి చాలు.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారంలో ప్రతి దినం తింటే జీవక్రియ, ఆయుర్దాయం పెరుగుతుంది. ప్రతిరోజు వాము రసం తీసుకుంటే గుండె నొప్పి ఉండదు. రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతి ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మ పండ్లరసం తీసుకుంటే రక్త వృద్ధి శుద్ధి అవుతుంది. పెద్ద ఉసిరికాయలు పట్టు తేనెలు నానబెట్టి ఆరు మాసములు ఉరిన తర్వాత రోజు ఒకటి తింటే రక్తపోటు హృదయ కోస వ్యాధులు దరి చేరవు.
ఎంతటి వారికైనా మంచి చురుకుదనం వస్తుంది. బొల్లి నివారణకు బాదం చాలా గింజలు గంధము బ్రతక చూర్ణం కలిపి మచ్చలపై పూయాలి. మునగాకు రసం మునగాకుతో వండిన వంటకాలు తింటే రోగాలు రావు. మునగాకు రసం తేనెతో కలిపి తాగితే రక్త శుద్ధి మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణజరుగుతుంది. దెబ్బల వలన కలిగిన నొప్పులు తగ్గాలంటే శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి. శిలాజిత్తు ఆకులను నూరి మాత్రలు చేసి తాగితే వాతావరణ మార్పుల వచ్చే జ్వరాలు తగ్గుతాయి. ఆకుకూరలు, అరటి పండ్లు, బంగాళదుంపలు, తులసి ఆకుల వల్ల బిపి తగ్గుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి తింటే మలబద్ధకం హరిస్తుంది.
అన్నపురసం తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. తలపోటు తగ్గుతుంది. అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతి తో తింటే ఆకలి పుడుతుంది. అజీర్ణం పోతుంది. గోరుచుట్టుకు పచ్చి పసుపు దుంప మెత్తగా నూరి వేలు పై పూసి మధ్య మధ్యలో తడుపుతూ ఉంటే బాధ తగ్గి నయమగును.. అరటి ఆకు రసం సర్వరోగ నివారిణి. మెంతులు, మెంతుకూర ఎక్కువ వాడిన చక్రవ్యాధి తగ్గును.. తెలగపిండి ఆకు రసం రోజు ఒక తులం సేవిస్తే మూత్రలు పిండాలలో రాళ్లు కరిగిపోతాయి. వేడి నీటిలో తేనె కలుపుతూ ఉంటే స్థూలకాయం తగ్గుతుంది. ఇలా చేస్తే చాలు మనం నిత్యం యవ్వనంగా, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.