Khairtabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైంది. అర్ధరాత్రి చివరి కలశ పూజ చేసి తెల్లవారుజామున 4 గంటలకే వెల్డింగ్ పనులను పూర్తి చేసుకుని ఖైరతాబాద్ మహాగణపతిని ట్రాలీపైకి ఎక్కించారు. అనంతరం తెల్లవారుజామున శోభయాత్ర మొదలుపెట్టారు. అయితే శోభాయాత్ర ఇంత త్వరగా మొదలవుతుందని ఎవరు అనుకోలేదు. దీంతో ప్రస్తుతం భక్తులు తాకిడి తక్కువగానే ఉంది. భక్తిల తాకిడి ఉద్రిక్తత ఎక్కువ కాకముందే త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కమిటీ ప్రయత్నిస్తుంది. అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ మహా గణపతి శోబయాత్ర జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల లోపే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదికి మహాగణపతిని తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక మధ్యాహ్నం 12 గంటల లోపు గణపతి నిమర్జనం కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ కూడా నిమర్జనం కార్యక్రమాలను త్వరగా పూర్తిచేయాలని కోరడంతో ఉత్సవ కమిటీ ఆ విధంగా ప్రయత్నాలు చేపట్టింది.అయితే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహా గణేశుడు శ్రీ దశమహావిద్య గణపతి గా దర్శనమిచ్చాడు. ఇక ఈ నవరాత్రులలో కొన్ని లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. గత ఆదివారం రోజు భారీ స్థాయిలో భక్తులు వచ్చారు. ఉత్సవ కమిటీ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ 11 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. అనంతరం ఈరోజు ఉదయం శోభయాత్ర ప్రారంభించారు. అయితే ఈరోజు ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండేందుకు స్వామివారిని త్వరగా హుస్సేన్ సాగర్ కు తరలించే ప్రయత్నం గా శోభయాత్రను త్వరగా ప్రారంభించారు.
ఇక ఈ సంవత్సరం 63 అడుగులు ఎత్తుతో 50 టన్నుల బరువుతో మొత్తం మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి రికార్డ్ సృష్టించారు ఉత్సవ కమిటీ. ఈరోజు రూట్ మ్యాప్ ప్రకారం టెలిఫోన్ భవన్ , తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం వైపుగా స్వామిని హుస్సేన్ సాగర్ లోని 4వ క్రేన్ వద్దకు తీసుకెళ్తారు. ఇక ఈ శోభాయాత్రలో ఎలాంటి సమస్యలు, తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం, పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 535 ఆర్టిసి బస్సులను భక్తుల కోసం ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు అర్ధరాత్రి ఒకటి వరకు మెట్రో రైలు నడిపించనున్నారు. తద్వారా నిమజ్జనానికి వచ్చిన భక్తుల త్వరగా ఇంటికి తిరిగి వెళ్తారు. ఇక ఈ సందర్భం గా ప్రభుత్వం స్కూలు మరియు ప్రభుత్వ ఆఫీసులకు గురువారం రోజు సెలవు ప్రకటించడం జరిగింది.