Disease ‘X’ : కరోనా ఈ పేరు వింటే చాలు యావత్ ప్రపంచమంతా భయందోళనకి గురవుతుంది. ఎందుకంటే అది చేసిన బీభత్సం అంతా ఇంత కాదు మరి. ఒక దీనిని తలుచుకుంటే ఇప్పటికీ ఉలిక్కిపాటే. అయితే ప్రస్తుతం కరోనా ను మించిన మహమ్మరి మరొకటి భూమిని కబళించడానికి సిద్ధమైందన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకా పేరు పెట్టని ఆ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసీస్ ఎక్స్ అని పిలుస్తుంది. దీనిని డబ్ల్యూహెచ్ వో ప్రాధాన్య జాబితా లో చేర్చబడింది. అంటే ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన కోవిడ్ 19 ఎబోలా వంటి వాటితో పేర్కొంది. అయితే డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న లెక్కల ప్రకారం 2019లో బయటకు వచ్చిన కరోనా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలను హరించింది.
అయితే ఇప్పుడు వస్తున్న కొత్త వైరస్ దాదాపు 5 కోట్ల మందిని కబళించడం ఖాయమని నిపుణులు చెబుతుండడంతో భయాందోళన మొదలైంది.ఇక ఇదే విషయాన్ని బ్రిటన్ వ్యాక్సిన్ టాక్స్ ఫోర్స్ చీఫ్ డాం భిన్ హుమ్ మాట్లాడుతూ డిసీస్ ఎక్స్ తో పోలిస్తే కరోనా ప్రమాదకరం కానే కాదని చెబుతున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన ఈ డిసీస్ ఇప్పటికే మొదలైందని…త్వరలోనే తన ఉనికిని చాటుకుంటుందని…అప్పటినుండి మరణం తప్పదని హెచ్చరించారు. అయితే అసలు ఏంటి ఈ డిసీస్ .అసలు ఇది ఎక్కడినుండి వ్యాప్తి చెందుతుంది..?ఎలా వ్యాప్తి చెందుతుంది..? ఎందుకు అంత ప్రమాదకరమైందో ఇప్పుడు తెలుసుకుందాం..? డిసీజ్ ఎక్స్ అనేది డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్ ప్రకారం మనకు తెలిసిన ఓ వైరస్ నుండి పుట్టుకొచ్చే అవకాశం ఉందట.ఇది ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన అంటువ్యాధిగా మారుతుందని పేర్కొంటున్నారు.
ఇక దానిని చూపిస్తూనే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఎక్స్ అని సూచించింది. అయితే దీనికి ఇప్పటివరకు ఎటువంటి చికిత్స లేదని స్పష్టం చేసింది. అయితే అది దగ్గు వలన ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. డబ్ల్యు హెచ్ ఓ అధికారికంగా 2018లో ఈ ఎక్స్ అనే పదాన్ని ఉపయోగించింది. ఇక ఈ ఎక్స్ అనే పదం భవిష్యత్తులో ఉద్భవించే మహమ్మారికి కారణమయ్యే కారకాలను సూచిస్తుందని తెలిపింది. దీనివలన ప్రపంచంలో తీవ్రమైన అంటూ వ్యాధులు ప్రబులుతాయి. ఇక అది ఏ రకమైన వ్యాధి అని నిర్ధారణ కారణప్పటికీ దీనివలన ప్రపంచ స్థాయిలో ఆది తీవ్రత చాలా ఉంటుందని పేర్కొంది. అందుకే ఈ డిసీస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాధాన్య వ్యాధుల జాబితాలో చేర్చింది. అయితే ఇప్పటికే కేరళలో ఓ మహమ్మారి కొందరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇక అది మరింత ప్రభావితం కాకముందే కేరళ ప్రభుత్వం దానిని కట్టడి చేసే విధంగా చర్యలు చేపట్టింది. మరి రానున్న రోజులో ఇలాంటి డిసీస్ తో ప్రపంచం తీవ్ర ప్రభావాలను ఎదుర్కొక్క తప్పదని కొందరు అంటున్నారు.