Pooja Tips : మందార పువ్వు ని చైనా గులాబీ అని కూడా పిలుస్తారు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పువ్వు అనేక రంగులను కలిగి ఉంటుంది. హనుమంతుడికి మంగళవారం నాడు మందార పువ్వుతో కొలిస్తే దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి మందార పూలతో పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సూర్య భగవానుడి పూజలో ఎర్ర మందార పువ్వు ప్రత్యేకం. మందార పువ్వు లేని సూర్యభగవానుడి పూజ వ్యర్థం.
నీటిలో మందార పువ్వు ను వేసి సూర్యభగవానుడికి సమర్పించాలి. సూర్య దోషాన్ని తొలగించడానికి మందార పువ్వు బాగా ఉపయోగపడుతుంది. మందార మొక్కను ఇంట్లో తూర్పు దిశలో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీంతో నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. శివపార్వతులకు మందార పువ్వు అంటే ఎంతో ప్రీతికరం. సోమవారం నాడు పాలల్లో మందార పువ్వుల ఉంచి శివపార్వతులకు అభిషేకం చేయడం ద్వారా వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మందార ఆకులను, పువ్వులను జుట్టు నివారణలో ఔషధంగా ఉపయోగిస్తారు. వివిధ రకాల కొబ్బరి నూనెలో ఈ పువ్వులను ఉపయోగిస్తారు.
Pooja Tips : మందార పువ్వు తో ఇలా చేయండి.

ఆకులను ఎండబెట్టి ఈ చుర్నాన్ని తలకు అప్లై చేస్తారు. ఇలా చేయడం ద్వారా అనేక రకాల జుట్టు సమస్యలు దూరం అవుతాయి. మందార పువ్వు మంగళ దోషాన్ని తొలగించడానికి చాలా మేలు చేస్తుంది. అంగారకుడి రంగు పువ్వులను ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మందార పువ్వు మొక్కని నాటండి. ఇది మంగళ దోషాన్ని తొలిగించి జీవితంలో వచ్చే కష్టాలను దూరం చేస్తుంది. మందార పువ్వుతో పూజ చేస్తే అనేక దోషాలు నివారింపబడతాయని జ్యోతిష్య శాస్త్రం తెలియజేసింది. మందార పువ్వుతో పూజ చేస్తే భార్యాభర్తలు కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు.