Life Style: తెలుగువారి సాంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళలు కాలికి మెట్టెలు పెట్టుకోవడం పద్ధతిగా పాటిస్తారు. చాలామంది ఆనవాయితీలో భర్త భార్యకు మెట్టెలు పెడతారు. కానీ కొంతమంది సాంప్రదాయ ప్రకారం మేనమామ, మేనత్త మెట్టలను పెడతారు. అసలు పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు..? ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్త్రీలు పెళ్లినాటి నుండి వీటిని ధరించడం మొదలు పెడతారు. మెట్టెలను కొందరు వెండితో తయారు చేసినవి, మరికొందరు బంగారంతో తయారు చేసినవి పెట్టుకుంటారు.
పురాణాలలో మహిళలు కాళ్లు మెట్టెలు ధరించడం గురించి కథలు చెప్పడం జరిగింది. రామాయణంలో రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆమెను రాముడు గుర్తించాలని తన కాలు మెట్టెను పడేసిందట. తద్వారా సీతను ఎవరు ఎత్తుకెళ్లారు అనే విషయాన్ని రాముడు కి తెలియడం జరిగింది. కాలి వేలికి మెట్టెలు తొడగడం వల్ల మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవు. దీని గురించి సైన్స్ తెలియజేసింది ఏమనగా. కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల స్త్రీలకు గైనిక్ సమస్యలు దరి చేర్చవట. వెండి మెట్టెలు పెట్టుకోవడం వల్ల గైనిక్ సమస్యల నుండి బయటపడవచ్చు అని నిపుణులు తెలియజేశారు.
Life Style : పెళ్లి తరువాత మహిళలు…. కాలికి మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

వెండి మెట్టలను ధరించడం వల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుందంట. మహిళలు ఇప్పుడు వివిధ రకాల మెట్టెలను ధరిస్తున్నారు. కానీ వెండి మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తరచుగా మెట్టెలు పెట్టుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మెట్టెలు పెట్టుకున్న వారిని పెళ్లైన స్త్రీగా గుర్తిస్తారు.