Health Tips : రోజు వర్షాలు పడటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలకు గురి అవుతారు. వర్షం కారణంగా వాతావరణంలో తేమ ఏర్పడి బ్యాక్టీరియా ,వైరస్ విజృంభిస్తాయి. వర్షాకాలంలో ఏర్పడ్డ తేమ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా పెరుగుతాయి. న్యూమో నియా, ఆస్తమా, ఇన్ఫ్లు, వివిధ వైరస్ ఇన్ఫెక్షన్లు అధికమవుతాయి. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతున్నారు. ఈ సీజన్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి . వర్షాకాలంలో గాలి వల్ల ఏర్పడిన పుప్పడి కంటెంట్ పెరగడం వల్ల, ఎలర్జీ సమస్యలు అధికమవుతాయి.
సోఫా కవర్లు, బెడ్ షీట్లు, టేబుల్ క్లాత్ తులు, డోర్ కాటన్స్, ఇంట్లో వాడే ఫాబ్రిక్ కైనా శుభ్రంగా , పొడిగా ఉంచుకోవాలి. దిండు కవర్లు కనీసం వారానికి రెండు సార్లు మార్చి వేయాలి. వాడిన టవల్సను ఎప్పటికప్పుడు ఎండలో ఆరనివ్వాలి లేదా శుభ్రపరచుకోవాలి. వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లయితే , అనేక రకాల వ్యాధులకు గురి అవుతాము. అందువల్ల ఇమ్యూనిటీని పెంచడానికి నట్స్, పండ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. విటమిన్ సి ,విటమిన్ డి, ఐరన్ ,ఒమేగా త్రీ, ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Health Tips : ఈ నియమాలు పాటిస్తే… మీ ఊపిరితిత్తులు సురక్షితం.

శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు తరచుగా ఆవిరి పట్టడం, ఆవిరి పట్టే సమయంలో ముక్కునుండి శ్వాస తీసుకొని.. నోటి ద్వారా వదిలేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల వాయు మార్గాలు.. క్లియర్ గా ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంచి మార్గం. ఇటువంటి సమస్య ఉన్నవారు వర్షాకాలంలో ఎక్కువగా త డుస్తూ ఉంటాం. బయటికి వెళ్లేటప్పుడు రైన్ కోట్స్, గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. 60 సంవత్సరాలు పైబడిన వారు వర్షాకాలం ముందు నిమోనియో వాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. ఇటువంటి వ్యాధితో బాధపడేవారు వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తెలియజేశారు.