Health tips : వర్షాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ కోసం.

Health tips : వర్షాకాలం వచ్చిందంటే తరచూ కురిసే వానా జల్లులు, వానచినుకులతో, మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాగే వర్షాల వలన పంట పండించే వాళ్లకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఈ వర్షాకాలంలో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు ఉంటాయి. జలుబు, దగ్గు, రొంప, జ్వరం, అని అనేక రోగాల బారిన పడే అవకాశాలు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది.ఇలాంటి సందర్భాలలో ఆరోగ్యం విషయంలోనూ, ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి పాటించాలి. పోషకాహార పదార్థాలను తీసుకోవాలి.వర్షం పడుతున్నప్పుడు కానీ, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ,అందరికీ వేడివేడిగా బజ్జీలు గానీ,గారెలు,పకోడీలు గానీ తినాలని అనిపిస్తుంది. అది సహజం కానీ వేడివేడిగా ఇంట్లోనే చేసుకుని తినాలి. బయట మాత్రం తినకూడదు. ఎందుకంటే బయట రోడ్ల మీద ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది.వర్షం పడినప్పుడు రోడ్ల మీద ఉన్న గుంటలో నీరు చేరి అలాగే ఉండి బ్యాక్టీరియా దాంట్లోనే ఉంటుంది. దాని వలన బ్యాక్టీరియా రోడ్ల మీద ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి వర్షాకాలంలో బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.అందువలన బయటి ఆహారం తినకూడదు.

Health tips : వర్షాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి

What food should be eaten during rainy season
What food should be eaten during rainy season

ఏం తినాలి అనిపి౦చినా తప్పకుండా ఇంట్లోనే వేడివేడిగా చేసుకుని తింటే మన ఆరోగ్యానికి మంచిది.ఈ వర్షాకాలంలో చిరుచేదుగా ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిది ముఖ్యంగా కాకరకాయ.అలాగే వర్షాకాలంలో పసుపు వంటల్లో ఎక్కువగా వాడుకోవాలి. వర్షాకాలంలో మాత్రమే దొరికే నేరేడు పండ్లను తప్పకుండా తినాలి.ఈ నేరేడు పండులో విటమిన్ ‘సి’ సమృద్ధిగా దొరకుతుంది. మనం వర్షాకాలంలో వాటర్ తక్కువగా తీసుకున్న , ఇలా విటమిన్ C ఉన్నవి తీసుకుంటే ఆరోగ్యానికి సహాయపడతాయి.ఈ వర్షాకాలంలో నీరు శాతం తక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవాలి.ఈ వర్షాకాలంలో బయటకు నుండి తీసుకొచ్చే ఆకుకూరలలో మట్టి, బ్యాక్టీరియా, ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఒకవేళ ఆకుకూరలు మనం తెచ్చుకున్న కొంచెం గోరువెచ్చని నీటిలో పసుపు వేసి ఆ ఆకుకూరని బాగా కడుక్కోవాలి.

ఈ వర్షాకాలంలో మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా తేలికగానే అరుగుతుంది.అందువలన ఒకటి రెండుసార్లు డీప్ ఫ్రై ఐటెమ్స్ కూడా చేసుకుని తినవచ్చు.అలాగే వర్షాకాలంలో దుంపలు, నువ్వులు, పల్లీలు ఇలాంటివి తీసుకోవచ్చు.ఏది ఏమైనా సరే ముఖ్యంగా రోడ్డు సైడ్ దొరికే ఫుడ్ అస్సలు తినకూడదు.అలాగే ఈ వర్షాకాలంలో మామూలుగా టీ, కాఫీలకు బదులుగా బ్లాక్ టీ తాగితే చాలా మంచిది.ఈ బ్లాక్ టీ, లో అమినో ఆసిడ్స్, కార్టచిన్ అనే ఫైటోకెమికల్స్ ఉంటాయి ఇవి శరీరానికి వ్యాధికారకాలకి రక్షణ ఇస్తాయి .అలాగే ఈ వర్షాకాలంలో కొంచెం గోరువెచ్చని పాలు, ఓట్స్,శొంఠి, బార్లీ,పుట్టగొడుగులు, బ్రౌన్రైస్, లాంటివి తీసుకుంటే చాలా మంచిది.

అలాగే ఈ వర్షాకాలంలో ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి .అలాగే ఈ వర్షాకాలంలో జలుబు లాగా అనిపించినా, అనిపించకపోయినా, ప్రతిరోజూ ఉదయాన్నే కొంచెం గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది.గొంతు నొప్పి లాగా అనిపిస్తే ఈ గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు కూడా వేసుకుని తాగితే మంచిది తక్షణమే రిలీఫ్గా ఉంటుంది.పాలలో పసుపు కూడా వేసుకొని తాగొచ్చు.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలామంది బయటినుంచి ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగుతారు. అలా తెచ్చుకుని తాగేవారు తప్పకుండా ఆ నీటిని కొంచెం గోరువెచ్చగా చేసి వడకట్టి తాగడం చాలా మంచిది.చూశారు కథ ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి