Sree Krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి…..పూజా విధానం ఏంటి…?

Sree Krishna Janmashtami : శ్రీకృష్ణుడి పుట్టినరోజు అంటే మన ఇంట్లో వ్యక్తి జన్మించినట్లుగా చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు న పూజ ఎవరు చేసుకోవాలి , పూజా విధానం, నైవేద్యాలు ఎలా సమర్పించాలి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణి బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇక ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగన స్థానాన్ని ఆచరించి గుమ్మానికి తోరణాలు కట్టుకుని పసుపు కుంకుమలతో పూజ గదిలో ముగ్గులు వేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి. అలాగే బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా ఇంటి బయట నుండి లోపటివరకు కృష్ణుడు చిన్ని చిన్ని పాదాలను ముగ్గులతో వేయాలి.  ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించడం వీలైతే ఆ సమయానికి పూజా విధానం సాగేల చూసుకోవాలి.

Advertisement

sree-krishna-janmashtami-date-time-in-2023-sree-krishna-janmashtami-pooja-vidhanam

Advertisement

పుష్పలు , పానకం , పండ్లు వంటి నివేదనలు సాధారణంగా మనం పెడుతూనే ఉంటాం. వీటితోపాటు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు వెన్న, మిగడని కూడా నైవేద్యంగా పెట్టాలి. అయితే మరికొందరు మినప పిండి మరియు పంచదార కలిపి కృష్ణుడికి నైవేద్యంగా కూడా పెడతారు. ఎందుకంటే కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి శ్రీకృష్ణుడు తల్లిని బాలింతగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్ధం అని చెప్పవచ్చు . అయితే కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా కృష్ణుడి స్మరణ కూడా చాలా ముఖ్యం. అలా శ్రీకృష్ణుడిని తలుస్తూ కొలుస్తూ పూజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు.

sree-krishna-janmashtami-date-time-in-2023-sree-krishna-janmashtami-pooja-vidhanam

కాబట్టే కొందరు రాత్రివేళ పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి నాడు అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా శ్రీకృష్ణుడు వేషధారణ లో చిన్నపిల్లలను అలంకరించి జన్మాష్టమి రోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. అంతేకాక శ్రీకృష్ణుడికి చిన్నతనంలో పెరుగు వెన్న అంటే చాలా ఇష్టం. దీంతో నిత్యం గోకులంలో ప్రజలు దాచుకున్న వెన్నెను దొంగలించి తినేవాడు . ఆ సమయంలో కొందరు తమ బాధను యశోదతో చెప్పుకునేవారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. శ్రీకృష్ణుడు చేసిన చిలిపి చేష్టలను మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

Advertisement