Vasthu tips : ఇలా చేస్తే మీకు తగిలిన నరదృష్టి…హాంఫ‌ట్

Vasthu tips : సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లి వచ్చినప్పుడు అసౌకర్యంగా ఫీల‌వుతూ ఉంటాము. అలాగే చిన్న పిల్లలు అసౌకర్యానికి గురి అవుతారు. ఏదైనా ఫంక్షన్కు వెళ్లినప్పుడు అక్కడి మనుషులు మనల్ని చూసి అసూయ పడటం వంటివి చేస్తుంటారు. అవతలి వారిని తెలియకుండానే వారు కంటి చూపు నుండి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీ వలన మనం అసౌకర్యానికి గురి అవుతాం. దీని విలువ ఇంటికి వచ్చాక తలనొప్పి రావడం, వాంటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది అంటారు. ఈ దిష్టిని తొలగించాలని మన పెద్దవాళ్ళు వివిధ రకాల చిట్కాలను ప్రయత్నిస్తారు. అందులో కొన్నింటిని మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

1) ఎదుటి వారి వలన కలిగే నెగటివ్ ఎనర్జీని తొలగించు కావాలంటే ముఖ్యంగా ఉప్పుతో ఇలా చేయాలి.ముందు చిన్న పిల్లలకు నరదిష్టి తగిలితే ముఖ్యంగా ఉప్పు, ఆవాలను చేతిలోకి తీసుకొని మూడు సార్లు పిల్లల మీద నుంచి తిప్పి వేయాలి. ఈ తర్వాత ఆ ఉప్పును , ఆవాలను ఎవరూ తొక్కని చోట వేయాలి .ఇలా చేస్తే పిల్లలకి త‌గిలిన‌ దృష్టి తొలగిపోతుంది. అలాగే పిల్లలకు ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎడమకాలు అరికాలులో కాటుక‌ను పెట్టాలి. అలాగే ఎడమ కాలుకు నల్ల దారాన్ని కట్టాలి. దీనివలన ఎదుటి మనుషుల చెడు దృష్టి పిల్లలపై పడదు. పిల్లలు అసౌకర్యానికి గురి కారు.

Advertisement

Vasthu tips : ఇలా చేస్తే మీకు తగిలిన నరదృష్టి…హాంఫ‌ట్

Vasthu tips for naradisti
Vasthu tips for naradisti

2) అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళకు చెడు దృష్టి తగిలితే ఏదైనా ఉప్పు చేతి నిండా తీసుకుని ఏడు సార్లు తిప్పి వేయాలి. తర్వాత ఎవరు తొక్కని చోట ఆ ఉప్పును పడేయాలి. అలా వీలుకాకపోతే సింకులో కానీ నీటిలో కాని ఆ ఉప్పును ప‌డ‌ వేయాలి. అలాగే పెద్ద‌వారు కూడా ఎడ‌మ‌కాలుకు న‌ల్ల దారాన్ని క‌ట్టుకోవ‌డం మంచిది. న‌ల్ల దారానికి చెడు శ‌క్తిని లాగే శ‌క్తి ఉంటుంది. క‌నుక వీలైనంత వ‌ర‌కు కాలికి న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం మంచిది.

3) అలాగే మన ఇంటి పై చెడు దృష్టి పడకుండా ఉండాలంటే ఒక గిన్నె తీసుకొని అందులో మిరియాలు వేసి పైన ఉప్పు వేసి కప్పివేయాలి. తర్వాత దానిని ఇంట్లో ఎవరు తిర‌గ‌ని చోట ఒక మూలకి పెట్టాలి. తర్వాత రోజు ఆ ఉప్పును నీళ్లలోనూ పారవేయాలి.ఇలా చేస్తే ఇంటికి దిష్టి త‌గలకుండా ఉంటుంది.

4) మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కడికైనా వెళ్లి వచ్చినప్పుడు అనారోగ్యానికి గురి అవుతారు. అలాంటప్పుడు ఒక గాజు గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకుని అందులో పిడికెడు ఉప్పును వేసి పెద్దవారి దగ్గర పెట్టాలి. తరువాత రోజు వాటిని ఎవరూ తొక్కని చోట కానీ పారే నీటిలో కానీ పారవేయాలి . ఇలా చేస్తే ఎదుటి మనుషులు చెడు దృష్టి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు

Advertisement