Vastu Tips : దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ పవిత్ర స్థలంగా భావిస్తారు. దేవాలయాల చుట్టుపక్కల, పరిసర ప్రాంతాలలో, ముందు వెనక భాగాలలో ఇల్లు ఉండకూడదని అంటుంటారు. కారణాలు ఏంటి అని అడిగిన పెద్దలు చెప్పరు ఇది ఒక నమ్మకం అంటూ ఉంటారు. ఇంతకు ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి ఎటువైపు ఉండకూడదు ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలున్నయన్ని మరిచిపోయి. దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటాము. భక్తులు ఎందుకంటే శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయంలో పూజలు ,హోమాలు ,యాగాలు జరుగుతాయి. అందుకే ఆలయంలోపల మాత్రమే కాదు చుట్టుపక్కల కూడా అంత పవిత్రంగా ఉండాలనుకుంటారు. పైగా ఆలయం నుంచి వచ్చే శక్తి తరంగాలు ఇళ్లపై పడితే ఆ శక్తిని తట్టుకునే శక్తి ఆ ఇంటికి ఉండకపోవచ్చు. అందుకే పెద్దలు ఆలయ సమీపంలో ఇల్లు ఉండకూడదని చెప్తారు. దీన్ని మరొక లాగా చెప్పాలంటే గుడి నీడ ఇంటి పైన పడకూడదని అంటుంటారు. అయితే ఆలయ దగ్గరలో నివాసాలు ఉండకూడదు అని కాదు. వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు వాస్తు నిపుణులు.
గుడి నీడ పడే గృహములో సుఖసంతో సంతోషాలు, మనశ్శాంతి ఉండదంటారు, ఆ ఇంట్లో రోజు ఏదో ఒక విషయంపై చర్చలు జరుగుతూ నే ఉంటాయి. అందుకే ఆలయానికి మరి దగ్గరగా కాకుండా కనీసం 150 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకుంటే మంచిది. ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదు అంటారు. దేవుణ్ణి ధ్వజం శక్తిసంపన్నం, అగ్రరూపం అందుకే ధ్వజస్తంభం ధ్వజం దేవుడు వైపు తిరిగి ఉంటుంది. అందుకే గత కాలంలో పర్వతాలు నది తీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి. వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయానికి ముందు వైపు ఇల్లు ఉండొచ్చు శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రుభయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవగానే పండితులు చెబుతారు. ఇంటికి గుడికి ఉండేద్వారాన్ని గర్భగుడిలో మూలవిరాట్ విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి.
Vastu Tips : గుడి సమీపంలో ఇల్లు నిర్మిస్తే ఏమవుతుందో తెలుసా..

విజ్ఞాన తొలగించే వినాయకుడి ఆలయం ఇంటికి ఉత్తరం, వాయువ్యం వైపు ఉంటే వారికి డబ్బు నష్టం ,అవమానాలు కలుగుతాయి. అనవసరమైన ఖర్చులు ఎదురవుతాయి. ఈ ఆలయానికైనా సరే కనీసం ముందు అడుగుల దూరం ఉండేలాగా ఇల్లు నిర్మించుకోవాలి . అమ్మవారి ఆలయానికి అతి దగ్గరలో ఉంటే ఆమె శక్తి కారణంగా ఆ ఇంట్లో వారు ఎవరు వృద్ధి చెందరు, అంతేకాకుండా ఏ కార్యక్రమం తలపెట్టిన వృధా అవుతుంది. గుడికి దగ్గరలో ఉన్న వారంతా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు మెయిన్ గేటు ఎటువైపు ఉందో చూసుకోండి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నుంచి ఎలా ఉన్నారు గమనించండి.. సరిగా అనిపించకపోతే వాస్తులో మార్పు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే. ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రదాయ బద్ధకం ఆలయాన్ని నిర్మిస్తారు. పెద్ద అక్షరాలతో కూడిన దేవతాయంత్రాన్ని, అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టిస్తారు. గుడిలో నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి, కానీ ఇళ్లల్లో అలా కాదు… ఎప్పుడు కప్పుడు అశుభ కార్యాలు జరుగుతాయి, ఆడపిల్లలకు నెలనెలా ఇబ్బందులు ఉంటాయి. ఈ ప్రభావం గుడికి వచ్చే భక్తులపై పడవద్దని ఉద్దేశం కూడా అయి ఉండవచ్చు అంటారు మరికొందరు పండితులు.