Health Benefits : స్టార్ ఫ్రూట్స్ తినడం వలన కలిగే ప్రయోజనాలు మీకోసం

Health Benefits : ఈ పoడును కరంభోలా లేదా స్టార్ ఫ్రూట్ అంటారు. తెలుగులో అంబనం కాయ అంటారు. స్టార్ ఫ్రూట్ నక్షత్రాల్లాగా ఉంటుంది, దీనిని అడ్డంగా కట్ చేస్తే ఒక స్టార్ లా కనిపిస్తోంది, స్టార్ ఫ్రూట్ లో అద్భుత పోషకాలు ఉన్నాయి, ఇవి మనకు చాలా అవసరం, చాలా రుచిగా ఉంటుంది, స్టార్ ఫ్రూట్ ని ప్రపంచం మొత్తం, ఆరోగ్యానికి ఇంటి వైద్యంగా వాడుతారు,షుగర్ వ్యాధి గ్రస్తులకు ఈ స్టార్ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది. దగ్గు, జ్వరానికి ఔషధంగా వాడతారు,ఈ స్టార్ ఫ్రూట్ లో, అధికంగా పీచుపదార్థం ఉండటం వలన ఈ స్టార్ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది, ఒక అధ్యయనం ప్రకారం, ఈ స్టార్ ఫ్రూట్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉండటం వల్ల జీవక్రియ రేటును వేగవంతం చేసిందని తేలింది.ఈ స్టార్ ఫ్రూట్ లో ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు మరియు గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

Advertisement

Health Benefits : స్టార్ ఫ్రూట్స్ తినడం వలన కలిగే ప్రయోజనాలు మీకోసం

స్టార్ ఫ్రూట్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నాశనం చేస్తుంది. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది, స్టార్ ఫ్రూట్ లో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. అదే విధంగా ప్రసవం తర్వాత ఈ స్టార్ ఫ్రూట్ తినటం వల్ల, తల్లి పాలు పడే విధంగా సహాయం చేస్తోంది. స్టార్ ఫ్రూట్స్ షుగర్ వ్యాధిగ్రస్తులకు బాగా పనిచేస్తుంది, రక్తంలోని షుగర్ శాతాన్ని నియంత్రించి, షుగర్ వ్యాధి గ్రస్థులకు మేలు చేస్తుంది.ఈ స్టార్ ఫ్రూట్ లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది, కావున మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ ఫ్రూట్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతుoదని తేలింది. స్టార్ ఫ్రూట్ తినడం వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ను స్టార్ ఫ్రూట్ మన శరీరం నుండి తీసివేస్తుంది, క్యాన్సర్ పై పోరాడే శక్తి స్టార్ ఫ్రూట్ కి ఉందని నిపుణులు చెప్తున్నారు, పరుగు పోటీలో పాల్గొనే వారికి స్టార్ ఫ్రూట్ చాలా మేలు చేస్తుంది, అలసటను తగ్గించి, యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.

Advertisement
health benefits of star fruit 
health benefits of star fruit

స్టార్ ఫ్రూట్ లో మన శరీరానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య, రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవటం, స్టార్ ఫ్రూట్ తినటం వలన నిద్రలేమి సమస్యను దూరం చేసి, నిద్ర పట్టే విధంగా చేస్తోంది. స్టార్ ఫ్రూట్ తినటం వలన అధిక బరువును తగ్గిస్తుంది. స్టార్ ఫ్రూట్ లొ మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి మన శరీరానికి చాలా అవసరం. దక్షిణ ఆసియా దేశాల్లో ఈ స్టార్ ఫ్రూట్ తినటం వలన మగవారిలో సెక్స్ సామర్థ్యం పెంచుతుందని వారు గట్టిగా నమ్ముతారు. అందరూ ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి,కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు మాత్రం ఈ స్టార్ ఫ్రూట్ ని తినకూడదు, ఎందుకంటే, ఇందులో హై కాన్సన్ట్రేటెడ్ ఆక్సలీక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు అంటే, మూత్ర పిండాల్లో రాళ్లు, డయాలసిస్ చికిత్స చేయించుకునే వాళ్ళు, మరియు కిడ్నీ వైఫల్యం అయినవారు, ఈ స్టార్ ఫ్రూట్ ని తినకూడదు.

Advertisement