Vastu Tips : చాలాసార్లు మన ఇళ్లల్లోకి వివిధ రకాల పక్షులు, జంతువులు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని పక్షులను శుభంగా, మరికొన్ని పక్షులను అశుభంగా పరిగణిస్తారు. కొంతమందికి ఇంట్లోకి ఎటువంటి పక్షులు వస్తే ఏం లాభాలు ఉంటాయో తెలియక అనవసరంగా భయపడుతుంటారు. అయితే మన పూర్వీకులు ఇంట్లోకి పిచ్చుకలు వస్తే ఇంటికి చాలా మంచిది అని అంటుంటారు. ఇంట్లోకి పిచ్చుకలు రావడం వలన ఇంటికి ధనప్రాప్తి కలుగుతుందని కొందరి అభిప్రాయం. అలాగే ఇంట్లోకి పిచ్చుకలు జంటగా వస్తే ఆఇంట్లో పెళ్లియోగం ఉన్నట్లు చెబుతారు. అలాగే ఇంట్లో కొత్తగా పెళ్లి అయిన వారు ఉంటే వారికి త్వరలోనే సంతానయోగం కలుగుతుందని కొందరి నమ్మకం. మన ఇళ్లల్లోకి పిచ్చుకలు ఒక్కటే కాదు వివిధ రకాల పక్షులు వస్తు ఉంటాయి. వాటి వలన మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
కొన్నిసార్లు మన ఇంటిలోకి కాకులు వస్తూ ఉంటాయి. కానీ వాటిని చాలామంది అశుభంగా భావిస్తారు. కాని కాకిని చనిపోయిన మన పెద్ద వారిగా భావించాలి. కాకి మీ ఇంట్లోకి ఎగురుకుంటూ వస్తే మీ పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని అనుకోవాలి. అలాగే ఎప్పుడైన బయటకు వెళ్లేటప్పుడు కాకి మీ నెత్తిన తన్నితే ఏదో కీడు జరగబోతుందని అర్ధం. అలాగే పంటపొలాల్లో ఉండే మిడుతలు ఎక్కువగా వర్షాకాలంలోవస్తూ ఉంటాయి. అయితే మిడుతలు ఇంట్లోకి రావడం అనేది ఇంటికి చాలా మంచిది. ఇంట్లోకి తేలు, జెర్రి రావడం అస్సలు మంచిది కాదు. ఇవి అశుభానికి సంకేతం. ఇలా వస్తే మీ ఇంట్లో శుభ్రత లేకపోవడం వలన తేలు, జెర్రులు వస్తాయి. కనుక వెంటనే ఇంటిని శుభ్రపరచాలి. అలాగే మన ఇంట్లో పూల మొక్కలు ఎక్కువగా ఉంటే సీతాకొకచిలుకలు వస్తాయి. ఇవి మన ఇంట్లోకి రావడం వలన చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. ఇవి మన ఇంట్లోకి వస్తే మనకు దనయోగం పడుతుందంట. అంతేకాకుండా మనకు ఆనందంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది.
Vastu Tips : మీ ఇంట్లోకి పిచ్చుకలు వస్తున్నాయా…అయితే మీకు త్వరలో ధనయోగం పట్టబోతుంది.

అలాగే చాలామంది గుడ్లగూబను చూసి భయపడుతుంటారు. కానీ గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం. ఎవరి ఇంట్లోకి గుడ్లగూబ వస్తుందో వారికి ధనలక్ష్మీ ప్రాప్తిస్తుందంట. అలాగే కొన్ని సార్లు పాములు ఇళ్లల్లోకి వస్తూ ఉంటాయి. ఇవి ఇంట్లోకి వస్తే ఇంట్లోవారు మానసికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కందిరీగలు ఇంట్లోకి వచ్చి గూడులను కట్టుకుంటే చాలా మంచిదంట.ఇలా కట్టుకుంటే ఇంటికి ధనం ప్రాప్తిస్తుందంట. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు తిరుగుతు ఉంటాయి. కాని కొందరు వీటిని చూసి భయపడుతూ ఉంటారు. కానీ ఇవి గోడలపై ఉండే కీటకాలను తిని మనకు మేలు చేస్తాయి. అలాగే వాస్తు ప్రకారంగా ఇంట్లో బల్లులు ఉండడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.