Vinayaka Chavithi : వినాయక చవితికి ఇంట్లో గణేషుడిని పెడుతున్నారా….ఈ 5 తప్పులు అస్సలు చేయకండి…

Vinayaka Chavithi  : వినాయక చవితి పండుగ మనదేశంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేే పండుగ. ప్రతి పల్లెలో పట్టణాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి స్వామికి నవరాత్రుల పూజలు చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడిని తీసుకువచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. భగవంతుని అతిథిగా పరిగణించి ఆహారం, నీరు, ప్రసాదంతో సహ ప్రతీది మొదట ఆయనకు సమర్పించాలి. ఆ తరువాతనే భక్తులకు అందించాలి.అలాగే సాత్విక భోజనాన్ని మాత్రమే సిద్ధం చేసి పెట్టాలి. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లి ,మాంసం పులియబెట్టిన ఆహారాన్ని అస్సలు పెట్టకూడదు. ఇవన్నీ కూడా గణేష్ నికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఆచితూచి అనుసరించాల్సిన నియమాలుగా తెలియజేస్తున్నారు.

Advertisement

vinayaka-chavithi-these-are-the-things-to-do-and-not-to-do

Advertisement

 

అయితే విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందు శుభ్రంగా స్నానం చేసి దేవాలయానికి వెళ్లి స్వామిని కచ్చితంగా దర్శించుకుని ఆ తర్వాత మాత్రమే విగ్రహాన్ని తీసుకురావాలని పండితులు తెలియజేస్తున్నారు.అలాగే విగ్రహాన్ని ఇంట్లో లేదా మండపాలలో ఉంచే సమయంలో ఈశాన్య దిశగానే ఉంచాలని పండితులు తెలియజేస్తున్నారు.అలాగే గణేష్ ని విగ్రహాన్ని మట్టితో తయారు చేయడం మంచిది. కృత్తిమ మెటాలిక్ రంగులను ఉపయోగించి తయారుచేసిన విగ్రహాలను సహజనీటి వనరులలో కాకుండా బకెట్లలో నిమజ్జనం చేయాలి. తద్వారా పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. అలాగే వినాయక నవరాత్రులలో చేయకూడని పనులు కూడా ఉన్నాయి.

vinayaka-chavithi-these-are-the-things-to-do-and-not-to-do

ఎట్టి పరిస్థితిలోనైనా సరే గణపతి మండపాలకు వెళ్లేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలి. అలాగే విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేయకుండా నైవేద్యాలను సమర్పించకుండా వినాయకుడు విగ్రహాన్ని నిమజ్జనానికి కూడా తీసుకు వెళ్ళకూడదు. అలాగే వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి లేదా మండపానికి తీసుకొచ్చినప్పటి నుండి విగ్రహాన్ని ఒంటరిగా అసలు ఉంచకూడదు. కచ్చితంగా విగ్రహం వద్ద ఎవరో ఒకరు ఉండాలి. అలాగే గణేశుని విగ్రహ స్థాపన ముహూర్తం సరైన ఆచారాల ప్రకారం జరిపించాలి. ఎలాంటి దుర్ముహూర్తంలో స్థాపన చేయకూడదు. అలాగే వినాయకుడి మండపాలను స్థాపించుకున్న వారు లేదా ఇంట్లోపెట్టుకున్న వారు ఈ నవరాత్రుల్లో ధూమపానం ,మద్యపానానికి దూరంగా ఉండాలి.

Advertisement