Bigg Boss 7 : ప్రశాంత్ ఆమె రతిక కాదు – రాధిక…కాస్త జాగ్రత్తగా ఉండు….

Bigg Boss 7  : సాధారణంగా ప్రతి సీజన్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య లవ్ ట్రాక్ నడిపించే ప్రయత్నం చేస్తారు బిగ్ బాస్.అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమై రెండు వారాలు అవుతుంది. అయిన ఇంకా ఆ ప్రేమ జంట ఎవరనేది మాత్రం ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు. మొదట కొద్ది రోజులు పాటు పల్లవి ప్రశాంత్ మరియు రతిక ఒక పెయిర్ అనిపించేలా చేస్తున్నారని అందరూ అనుకున్నారు. బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఇదే అనుకున్నారు. సీజన్ 7 హౌసు లో వీరే తొలి లవ్ బర్డ్స్ అని అందరు అనుకున్నారు. అలాగే శుభశ్రీ మరియు డాక్టర్ గౌతమ్ కృష్ణ వీరి మధ్య కూడా సంథింగ్ సంథింగ్ ఉందని అందరూ అనుకున్నారు. వీరిది కూడా ఒక ప్రేమజంట అవుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే గౌతమ్ కృష్ణ కు ముందునుండే వైబ్స్ ఉన్నాయి కానీ శుభశ్రీ నుండి ఎలాంటి వైబ్స్ కనిపించలేదు. ఇక పల్లవి ప్రశాంత్ మరియు రతిక మధ్య తొలి వారంలో ఎన్నో రకాల కామెంట్స్ వచ్చాయి.

Advertisement

pallavi-prasanth-fans-fires-on-rathika

Advertisement

వీరిద్దరు కూడా ఎంతో ఇష్టంగా ఉంటున్నారు అనేది ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. పక్కపక్కనే కూర్చుని తినడం , అలాగే హౌస్ లో గేమ్స్ దగ్గర ఎక్కువగా మాట్లాడుకోవడం, ఇలా తొలివారం కంటెంట్ అంతా వీరిద్దరి ఇచ్చారని చెప్పుకోవాలి. అయితే తొలి వారం అంతా బాగానే నడిచింది కానీ రెండోవారం మాత్రం ఉల్టా పుల్టా అయింది. రెండోవారం నామినేషన్స్ లో వీరిద్దరూ మధ్య జరిగిన గొడవ వలన పూర్తిగా వీరిద్దరూ మాట్లాడుకోవడమే మానేశారు. అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేసిన సమయంలో రతిక ప్రశాంత్ కు సపోర్ట్ గా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రతిక గులాబీ ముల్లుల ప్రశాంత్ ను గుచ్చేసింది. నామినేషన్ లో భాగంగా ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వచ్చేందుకు కుక్కల తిరిగానని చెప్తే, ఇంతలా తిరిగిన వాడివి హౌస్ లోకి వచ్చి ఏం చేస్తున్నావని రతిక అడగడంతో అందరూ షాక్ అయ్యారు.

pallavi-prasanth-fans-fires-on-rathika

రైతు బిడ్డ ప్రశాంత్ కూడా ఇది అస్సలు ఊహించలేదు. రతిక ఇలాంటి కామెంట్స్ చేయడం చూసి బాగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. ఇక అప్పటినుంచి వీరిద్దరు కాస్త దూరంగానే ఉంటున్నారు. మొదటి వారంలో రతిక ఎక్కడ ఉంటే అక్కడకు పల్లవి ప్రశాంత్ వెళ్లేవాడు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో ప్రిన్స్ యావర్ రతికపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరొక లవ్ ట్రాక్స్ సిద్ధం అవుతుందా లేక డ్రామానా అని ప్రేక్షకులు సందేహ పడుతున్నారు. అయితే ప్రస్తుతం యావర్ పల్లవి ప్రశాంత్ ప్లేస్ లోకి వచ్చినట్లుగా అర్థమవుతుంది. దీంతో ప్రశాంత్ అభిమానులు ఆమె రతిక కాదు రాధిక…నువ్వు ఆమెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకొస్తున్నారు.

Advertisement