hairfall tips : ఇప్పుడు మన భారతదేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు కాలుష్యం కూడా అంతకుమించి పెరుగుతుంది. ఈ కాలుష్యం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో ఒకటే జుట్టు రాలడం సమస్య. అందరిని ఎక్కువగా బాధిస్తున్న సమస్య కూడా ఇదే. జుట్టు రాలకుండా వుండడం కోసం వివిధ రకాల హెయిర్ కండీషనర్స్, షాంపులు వాడుతుంటాం. అయిన హెయిర్ ఫాల్ సమస్య తగ్గదు. అయితే,ఈ జుట్టు రాలడం సమస్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కొత్త చిట్కాను మీకు పరిచయం చేయబోతున్నాం.ఈ చిట్కాను ఈజీగా ఇంట్లో తయారుచేయవచ్చు.
ఎలా తయారుచేసుకోవాలో క్రింద చూడండి.తయారీ విధానం: ముందుగా మన ఇంట్లో పూసే మందార పువ్వులను బాగా ఎండపెట్టుకోవాలి. బయట దొరికే మందార పువ్వులు ఫ్రెష్ గా వుండవు కనుక ఇంట్లో పూసినవి అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో ఎండిన మందార పువ్వులను వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కలబంద గుజ్జును వేసుకోవాలి. మళ్లీ ఒకసారి మిక్సీ పట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొన్నసగం కొబ్బరికాయను వేసుకొని ,కొన్ని నీళ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.తర్వాత గుడ్డ వేసుకొని వడగట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయి.

ఇంతకుముందు,మిక్సీ పట్టుకొని ప్రక్కన పెట్టుకున్న దాంట్లో కొబ్బరిపాలు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను ఒక గిన్నెలో తీసుకొని, బాదం నూనె లేదా కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు పెట్టుకునే ముందు జుట్టుకు కొబ్బరి నూనెను రాయాలి. ఒక గంట తరువాత ఈ మిశ్రమాన్ని తలకు రాసుకొని 30 నిమిషాలు వుంచుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు,మూడు సార్లు చేయాలి.ఇలా చేయడం వలన జుట్టులో చుండ్రు తగ్గి, జుట్టు మందంగా, పొడవుగా పెరుగుతుంది.ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేయండి.