Kumkuma : పెళ్లయిన ఆడవారు కుంకుమను నుదిటిన అలాగే పాపిడ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. ఈ కుంకుమ అంటే ఆడవారు ఐదోతనంగా భావిస్తుంటారు. హిందూ మతంలో పసుపు, కుంకుమలకు పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. పెళ్లయిన ఆడవారు నిత్యము కుంకుమను ధరించాలి. అనే ఆచారం కూడా మనం హిందూ ధర్మంలో ఉంది. అదేవిధంగా కుంకుమ పెట్టుకునే విధానం బట్టి ఆ మహిళకు వివాహం అయింది. అలాగే భర్త ఉన్నాడు. అనే సాంప్రదాయాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి వివాహమైన మహిళ తప్పక కుంకుమను నుదిటిన పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వివాహమైన ప్రతి మహిళ నుదిట కుంకుమను తప్పక పెట్టుకోవాలి. అని సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవి ఆజ్ఞాపించారట. అని పురాణాలు తెలియజేస్తున్నాయి.
అలాగే వివాహం కాని అమ్మాయిలు కుంకుమ నుదిటిన పెట్టుకోరు. అనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే వివాహమైన మహిళలు మొత్తం ఐదు ప్రదేశాలలో కుంకుమను పెట్టుకుంటూ ఉంటారు. మరి మహిళలు కుంకుమ పెట్టుకునే ఐదు స్థానాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. పాపీట్లో కుంకుమను పెట్టుకోవాలి. రాముడు భార్య అయిన సీతాదేవి ఎప్పుడు పాపిట్లో సింధూరం ధరించి ఆ సింధూరంపై పాపడబిళ్ళను పెట్టుకునేదట. అప్పుడు సీతాదేవిని ఆంజనేయస్వామి సింధూరం ఎందుకు ధరిస్తున్నావమ్మా అని అడగగా.. సీతాదేవి నా స్వామి నన్ను ఎప్పుడు ఎంతో ప్రేమగా చూసుకుంటారని నా స్వామి నా వైపు ఆకర్షితిడుఅవుతాడని తెలియజేసిందట.
Kumkuma : మహిళలు కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి…

ఇక అప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం శరీరమంతా పూసుకోవడం అలవాటుగా మార్చుకొని శ్రీరాముని ప్రీతిపాత్రుడయ్యాడు. అదేవిధంగా నుదిటిన కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్ పెరగటంతో పాటు ఎప్పుడు సుమంగళిగా ఉంటారట. అదేవిధంగా గొంతు కింద భాగంలో కంఠం దగ్గర కుంకుమను పెట్టుకుంటుంటారు. ఈ విధంగా కుంకుమను ఐదు ప్రదేశాలలో ధరించిన మహిళకు వైవిధ్యం లేకుండా తన భర్త కన్నా ముందే సౌభాగ్యవతిగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుందట. అందుకే రాముడు భార్య అయిన సీతాదేవి కూడా ఈ విధంగా కుంకుమను ధరించడం వలన రాముని కంటే ముందే అవతారాన్ని వదిలేసింది. కాబట్టి పెళ్లయిన ప్రతి మహిళ కుంకుమను ధరించి మీరు సౌభాగ్యవతిగా ఉండండి