Astrology : సాధారణంగా ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొన్ని అలవాట్లు మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి. ఈ అలవాట్ల వలన కూడా ఇంట్లో ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివలన ఇంట్లో పేదరికం పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని అలవాట్లు అస్సలు మంచిది కాదు. ఈ అలవాట్లు వారి జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లోకి లేని పోని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధికంగా బాగా కృంగిపోతారని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఒక మనిషికి చెడు జరిగితే అతడిని విధి నిందించటం మనం తరచూ చూస్తు ఉంటాం. కాని వాస్తవానికి ఆ వ్యక్తి చెడు అలవాట్ల వలనే వారి జీవితంలో కీడు జుగుతుంది. వ్యక్తి చేసే చెడు పనుల వలనే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. జీవితంలో పేదవారిగా మిలుగుతారు. ఇప్పుడు ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం…
1) కొంతమంది వంట చేయడం అయిపోయాక వంటగదిని శుభ్రం చేయరు. ఎక్కడి వస్తువులను అక్కడే పడేస్తుంటారు. వంటగది ఇలా అశుభ్రంగా ఉండడం లక్ష్మీదేవికి ఏ మాత్రం నచ్చదు. ఆ కారణం చేత లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఇంట్లో దరిద్య్రం తాండవం చేస్తుంది. ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఎన్నో నష్టాలను అనుభవిస్తారు. అందుకే వంట పూర్తి అయ్యాక గదిని శుభ్రపరచుకోవాలి. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.
Astrology : ఈ 4 చెడు అలవాట్లతో మీరు ఆర్ధికంగా కృంగిపోతారు.

2) అలాగే కొందరు స్నానం చేయకుండా మురికిగా, శుభ్రం లేకుండా ఉంటారు. పరిశుభ్రత టేని చోట లక్ష్మీదేవి అస్సలు కొలువుండదని కొందరి నమ్మకం. కాని చాలా మంది ఇంటి చుట్టూ మురికిగా ఉంచుతారు. దీనివలన శుభ్రత లోపించి ఇంట్లోని వారు అనేక రోగాల బారిన పడుతారు. అనారోగ్య సమస్యలకు వేల వేల డబ్బులు వృధా అవుతాయి. దీనివలన పేదరికంలోకి జారిపోతారు. ఆర్ధికంగా ఎప్పటికి ఎదుగలేరు. కనుక ఇంటి శుభ్రతతో పాటు మనిషి శుభ్రంగా ఉండాలి.
3) చాలామందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇది చాలా పెద్ద చెడ్డ అలవాటు. ఇలా చేయడం వలన తమ గ్రహబలంలోని సూర్యుడు బలహీనుడు అవుతాడు.దీనివలన ఆరోగ్యంపై దుష్ర్పభావం ఏర్పడుతుంది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గోర్లను కొరకడం వలన గోళ్లల్లో ఉండే మట్టి నోటిలోకి వెళుతుంది. దానిలో ఉండే బ్యాక్టీరియా అనేక రోగాల పాలు చేస్తుంది. కనుక ఎప్పుడైన సరే గోళ్లను కొరకడం చేయరాదు.
4)అలాగే కొందరు నడిచేటప్పుడు పాదాలను భూమికి ఈడుసుకుంటూ నడుస్తారు. ఇలా నడిచే అలవాటు అస్సలు మంచిది కాదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక నడిచేటప్పుడు పాదాలను సరిగ్గా పెట్టి నడవాలి.