Green Tea : రోజు ప్రతి ఒక్కరూ టీ లను తీసుకుంటారు కానీ కొద్ది మంది మాత్రమే గ్రీన్ టీ ని తాగుతున్నారు . కానీ టీ ఆకులను అనేక రకాలుగా వర్గీకరించారు. గ్రీన్ టీ ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది అయితే ఈ టీని తాగితే బాడీకి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇవి శరీరానికి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. తరచుగా గ్రీన్ టీ ని. తీసుకుంటే అధిక బరువు తగ్గవచ్చు శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి వెయిట్ లాస్ సమస్యను దూరం చేస్తుంది.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ టీలో ఒక్క స్పూన్ తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.గ్రీన్ టీ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెండు కప్పుల వాటర్ ని తీసుకొని బాగా మరగనివ్వాలి తరువాత దానిని కప్పులో పోసి గ్రీన్ టీ సంచిని లేదా. గ్రీన్ టీ ఆకులను వేసి పది నిమిషాల వరకు ఉంచి దానిలో కొంచెం టెస్ట్ కోసం తేనె నిమ్మరసం వంటివి కలుపుకుని తాగాలి. రెగ్యులర్ గా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉండదు అని వివిధ రకాల పరిశోధనల వల్ల తెలిసింది.
Green Tea : గ్రీన్ టీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా
దంతాలకు క్యావిటిల వచ్చే ఛాన్స్ తగ్గటానికి గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుంది. నోటి నుండి దుర్వాసన, దంతక్షయం, వివిధ రకాల చిగుళ్ళ సమస్యలను తగ్గించే బ్యాక్టీరియాలను గ్రీన్ టీ కలిగి ఉంది ఇ యాంటీ-ఆక్సిడెంట్స్ నాశనం చేస్తాయి. ఈటీ క్యాన్సర్ సమస్యలను దూరం చేస్తుంది గ్రీన్ టీలో ఉన్న పాలీ ఫైనల్స్ స్కిన్ డ్యామేజ్ కాకుండా ఎక్కువ వయస్సు ఉన్న వారు కూడా తక్కువ వయసు లా కనిపిస్తారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి గ్రీన్ టీలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు గట్టిగా ఉంటాయి. కావున ఆస్టియోపొరొసిస్ వచ్చే రిస్కు కూడా తగ్గుతుంది అని వైద్య నిపుణులు తెలియజేశారు.