Viral Video : ఈరోజుల్లో సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా అందరూ వాడుకుంటున్నారు. కొందరు నెగెటివిటీని ప్రచారం చేయడానికి వాడుకుంటారు. మరికొందరు.. పాజిటివిటీని ప్రచారం చేయడానికి.. ఇంకొందరు ఫన్నీ వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇంకొందరు టైమ్ పాస్ వీడియోలు, యూజ్ ఫుల్ వీడియోలను షేర్ చేస్తుంటారు. ఏ వీడియోను షేర్ చేసినా.. చివరకు ఆ వీడియో కానీ.. సమాచారం కానీ.. నెటిజన్లకు నచ్చితే దాన్ని వైరల్ చేస్తారు. లేకపోతే ఆ వీడియోను ఎవ్వరూ పట్టించుకోరు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి తెగ వైరల్ చేస్తున్నారు. నిజానికి.. ఇదేమీ ఫన్నీ వీడియో కాదు.. కొంచెం షాకింగ్ వీడియోనే.
Viral Video : ఇంతకీ ఆ బుడ్డోడు ఏమైనట్టు?
సాధారణంగా ఎగ్జిబిషన్ అంటే చాలు.. పిల్లలు అయితే ఎగిరి గంతేస్తారు. ఎగ్జిబిషన్ కు ఉన్న మహత్తు అటువంటిది. ఎగ్జిబిషన్ లో పిల్లలు సరదాగా రకరకాల రైడ్స్ చేస్తుంటారు. ఆ రైడ్స్ ను ఎంత కేర్ తీసుకొని చేస్తే అంత బెటర్. తాజాగా మలేషియాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
ఎగ్జిబిషన్ లో ఓ బుడ్డోడు ఫన్ రైడ్ చేస్తున్నాడు. ఇద్దరు చిన్నారులు కూర్చొని రైడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక రౌండ్ తిరిగే సరికి.. ఇద్దరు చిన్నారులు తమ సీట్లలో కనిపిస్తారు. రైడ్ రెండో రౌండ్ కు వచ్చేసరికి అక్కడ ఇద్దరు పిల్లలు ఉండరు. ఒక చిన్నారి మాత్రమే కనిపిస్తాడు. ఇంకో పిల్లాడు ఎటు వెళ్లాడా అని అందరూ టెన్షన్ పడతారు.
Disappearing boy on fairground ride has everyone baffled – can you work out what’s going on? pic.twitter.com/PK1gWLrPuQ
— The Sun (@TheSun) June 10, 2022
ఈ ఘటనను ఓ మహిళ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పిల్లాడు ఎటు వెళ్లాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా.. ఆ పిల్లాడు ఎటూ వెళ్లలేదు. ఎక్కడా మిస్ అవలేదు. ఆ సీట్ లోనే కిందికి వంగి కూర్చొన్నాడు. దీంతో ఆ పిల్లాడు వీడియోలో రికార్డు కాలేదు. ఆ సీటు కూడా ఖాళీగా కనిపించింది.
ఏది ఏమైనా.. ఒక్క క్షణం మాత్రం ఆ పిల్లాడి తల్లిదండ్రుల గుండె ఆగిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాళ్లు ఊపిరి పీల్చుకొని ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.