Health Tips : ఎంతోమంది ఒంట్లో విపరీతమైన వేడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విపరీతమైన ఉష్ణోగ్రత పెరగడం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముక్కులోంచి రక్తం రావడం, పెదాలు పగిలిపోవడం, పాదాలలో పగుళ్లు, తలనొప్పి ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. దీని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేసి అలసిపోయి ఉంటారు. ఈ క్రమంలో శరీర అధిక ఉష్ణోగ్రత కు ఈ ఐదు రకాల పండ్లను తీసుకోవడం వలన ఈ విపరీతమైన వేడి కి చెక్ పెట్టవచ్చు.. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిని తీసుకోవడం వలన శరీరంలో అతి వేడి కంట్రోల్లో ఉంచవచ్చు అని పేర్కొంటున్నారు. అయితే ఆ ఐదు పండ్లు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం…
*దోసకాయ…
దోసకాయ ఎండాకాలంలో తీసుకుంటే శరీరాన్ని చల్లబరుస్తుంది అంటూ ఉంటారు. శరీరంలో అతి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ దోసకాయని తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. దోసకాయలు తక్కువ క్యాలరీలు ఉంటాయి. అదే టైంలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే డీహైడ్రేటుగా ఉన్నప్పుడు ఈ దోసకాయను తీసుకుంటే హైడ్రేట్ గా చేస్తుంది. దోసకాయతో మరిన్ని ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
Health Tips : శరీరంలో వేడి అధికమవుతుందా.? అయితే ఈ 5 పండ్లను తీసుకుంటే చాలు…

*అరటిపండు…
దీనిలో విటమిన్ b6, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఈ పనిలో రాగి, మ్యాగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ఇది కండరాలను విశ్రాంతి ఉంచడంలో ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో అతి వేడిని తగ్గించడంలో మేలు చేస్తుంది.
*నిమ్మకాయ…
నిమ్మకాయ మనుషుల్ని రిఫ్రెష్ చేస్తుంది. దీనిని ఎండాకాలంలో తీసుకోవడం వలన అద్భుతమైన లాభాలు ఉంటాయి. అలాగే సహజమైన రోజులలో కూడా నిమ్మకాయ జ్యూస్ త్రాగవచ్చు. గోరువెచ్చని నీరు నిమ్మరసం తేనె కలిపి తీసుకోవచ్చు. ప్లు,జలుబు, ఫుడ్ పాయిజనింగ్ లాంటి వాటిని నివారించడంలో ఉపయోగపడుతుంది.
*స్ట్రాబెరీలు…
ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నారింజలు కన్నా ఎక్కువ విటమిన్ సి వీటిలో ఉంటుంది. దాంతోపాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ డేమేజ్ నుండి కాపాడతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతాయి. శరీరంలో అతి వేడిని తగ్గిస్తుంది.
*పుచ్చకాయ… సహజంగా ఇవి ఎండాకాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ పుచ్చకాయలో లైకోపీన్, విటమిన్ సి, ఫైబర్ లాంటి గుణాలు అధికంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ రాకుండా రక్షించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పుచ్చకాయలు ఆర్ జి 9, సిట్రిలిన్ అనే ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్ నీ ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయి. ఇది ఒంట్లో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో అతి వేడిని కంట్రోల్లో ఉంచుతుంది.