Navaratri 2022 : పండుగలకు హిందూమతంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. నవరాత్రి రోజుల్లో శక్తి ఆరాధన ముఖ్యమైన స్థానం ఉంది. అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నైవేద్యాలతో పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దుర్గాదేవిని నవరాత్రులు తొమ్మిది రోజుల్లో విభిన్న రూపాలను పూజిస్తారు. దుర్గాదేవిని అనేక రూపాలలో పూజించడం వల్ల అనుకూల ఫలితాలు ఏర్పడతాయని భక్తుల నమ్మకం. నవరాత్రి 9 రోజుల్లో 9 శక్తి రూపాలతో భక్తులు తొమ్మిది రకాల కోరికలు నెరవేరడమే కాకుండా తొమ్మిది గ్రహ దోషాలు కూడా దూరమవుతాయట. ఈ విధంగా నవరాత్రికి తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి హిందూ ధర్మం ప్రకారం పూజలను చేస్తారు. అయితే అమ్మవారిని కొన్ని నియమ నిబంధనలతో పూజిస్తే.. జాతకంలో ఏర్పడ్డ అనేక దోషాలు తొలగిపోయి సంపద లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే జాతకం ప్రకారం ఈ గ్రహం వారు ఏ అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తే… మంచి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
మీ జాతకంలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే రాహువు పనిచేస్తున్నట్లే. దీనికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి నవరాత్రుల రెండో రోజున బ్రహ్మచారి అమ్మవారిని సంప్రదాయాలను అనుసరించి పూజించాలి. ఒక వ్యక్తి తన జాతకంలో బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు దూరం అవ్వాలంటే, అతను ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే..
వాటిని తొలగించుకోవడానికి నవరాత్రి ఆరో రోజున కేత్యా ని అనే అమ్మవారిని నిష్టగా పూజించాలి.
మీ జాతకంలో బుద్ధి కారణంగా పరిగణింపబడే చంద్రునికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే..
ఆ దోషాన్ని తొలగించుకోవడానికి, నవరాత్రుల్లో నాలుగవ రోజున కుష్మాండ దేవిని పూజించాలి.
మీ జాతకంలో శని దోషం ఏర్పడినట్లయితే… అటువంటి వారి శనేశ్వరుడిని శాంతింప చేయడానికి, శని సంబంధమున్న దోషాలను తొలగించుకోవడానికి, నవరాత్రుల్లో ఏడో రోజున కాళరాత్రి దేవిని
పూజించాలి.
Navaratri 2022 : ఈ దేవతను నవరాత్రుల్లో పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.
తొమ్మిది గ్రహాలకు రాజుగా సూర్యుని భావిస్తారు. సూర్య బలం నీ జాతకంలో బలహీనంగా ఉండి మీకు ఇబ్బంది కలిగిస్తుంటే.. సైలపుత్రిని పూజించండి. సిరి సంపదలు పొందడానికి నవరాత్రుల మొదటి రోజున పూజించాలి. జీవితంలో అన్ని రకాల ఆనందాలను, శుభాలని ఇచ్చే శుక్రు దోషాలు ఉన్నవారు… మంచి ఫలితాలు పొందడం కోసం నవరాత్రుల్లో తొమ్మిదో రోజున సిద్ధి ధాత్రి అమ్మవారిని పూజించండి.. ఇలా పూజించడం వల్ల శుక్రు దోషం తొలగి.. మంచి ఫలితాలు పొందగలరు. ఈ వ్యక్తి జాతకంలో అశుభాలు గోచరిస్తుంటే.. కుజుడి అనుగ్రహం కోసం నవరాత్రుల్లో ఐదో రోజున స్కందమాత దేవిని పూజించాలి. దుర్గాదేవిని పూజించి, మంత్రాన్ని చదువుతూ ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు శుభ ఫలితాలు ఇస్తాడు. బృహస్పతిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదృష్టం గా పరిగణిస్తారు. ఈ బృహస్పతి గ్రహం సంబంధిత దోషాలు దూరం అవ్వాలంటే నవరాత్రి 8వ రోజున మహా గౌరీ అమ్మవారిని పూజించాలి