Shaakunthalam movie : డైరెక్టర్ గుణశేఖర్ మహాభారత ఇతిహాసంలోని శకుంతల, దుష్యంతుడి ప్రేమ గాధని మైతలాజికల్ డ్రామాగా శాకుంతలం సినిమాగా పెట్టారు. శకుంతల పాత్రలో సమంత నటించింది. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. దుర్వాస మహర్షిగా మోహన్ బాబు, కన్వ రిషి గా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని గుణ టీం వర్క్స్ బ్యానర్ పై కుమార్తె నీలిమ గుణ నిర్మించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. గత కొన్ని నెలలుగా ఈ సినిమాకి సంబంధించిన సీజీ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వీలు రాలేదు. అయితే పర్ఫెక్ట్ టైమింగ్ చూసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి బ్యాక్ సపోర్టర్ గా దిల్ రాజు ఉన్నారు. దిల్ రాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే హక్కుల్ని ముందే సొంతం చేసుకున్నారు. దీంతో శాకుంతలం రిలీజ్ డేట్ ఆయన చేతిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేయాలని కూడా గుణశేఖర్ అంటున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తో పాటు రిలీజ్ వ్యవహారాలు ఆయనే చూసుకోవాలి కాబట్టి గుణశేఖర్ ఆయనకే వదిలేశారట. ఆ కారణం గానే దిల్ రాజు ఎప్పుడు సై అంటే అప్పుడే రిలీజ్ చేయాలని ఆలోచనలో గుణశేఖర్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
Shaakunthalam movie : దిల్ రాజు ఎప్పుడు సై అంటే అప్పుడే…

ఇదిలా ఉంటే ఇంతవరకు రిలీజ్ డేట్ కన్ఫామ్ కానీ ఈ సినిమాని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. జనవరిలో రిలీజ్ అనుకుంటే భారీ సినిమాల పోటీ ఉంది. అంతేకాకుండా ఆ టైంలో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. కాబట్టి దిల్ రాజు శాకుంతలం సినిమాను డిసెంబర్ కి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్లో పెద్ద సినిమాల పోటీ ఉండే అవకాశం లేకపోవడంతో గుణశేఖర్ కూడా దిల్ రాజ్ నిర్ణయానికి సై అంటున్నాడట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.