Rashmika Mandanna : రష్మిక మందన్నా అనే కన్నా.. నేషనల్ క్రష్ అంటే చాలు అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రష్మికాదే. తనకు ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో తెలుసు కదా. కేవలం పుష్ప సినిమాతో తన రేంజే మారిపోయింది. తను ఇప్పుడు కుర్రాళ్ల కలల రాణి. నేషనల్ క్రష్.. పాన్ ఇండియా స్టార్. పుష్ప సినిమా తర్వాత తనకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయినప్పటికీ… తను ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. సెలెక్టివ్ గా ముందుకెళ్తోంది. పుష్ప సినిమాతో తనకొచ్చిన క్రేజ్ ను చూసి బాలీవుడ్ మొత్తం నివ్వరబోయింది. అందుకే తను బాలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఈ కన్నడ బ్యూటీ.

కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లోనే కాలు మోపింది ఈ సుందరి. టాలీవుడ్ లో తన కెరీర్ కాస్త ఒడిదుడుకులకు గురయినా.. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కేవలం సినిమాల మీదనే దృష్టి పెడుతోంది ఈ భామ. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ చేసిన రష్మిక.. పుష్ప 2 సినిమా కోసం రెడీ అవుతోంది. ఇక.. సోషల్ మీడియాలో రష్మిక ఏం చేసినా సంచలనమే.
Rashmika Mandanna : ఆడియో ఫంక్షన్ లో లెహంగా వేసుకొని కుర్రాళ్లను రెచ్చగొట్టిన రష్మిక
తాజాగా ఓ ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న రష్మిక వేసుకున్న డ్రెస్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. రష్మిక ఏంటి… తన అందం ఏంటి.. ఆ డ్రెస్ ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక ఇంత అందంగా తయారైంది ఏంటి.. ఎద అందాలను చూపిస్తూ లెహంగా వేసుకొని నేషనల్ క్రష్ అనిపించుకుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రష్మిక వేసుకున్న లెహంగా డ్రెస్ పై సోషల్ మీడియాలో డిబేట్స్ నడుస్తున్నాయి. ఎద అందాలను చూపిస్తూ ఆడియో ఫంక్షన్ లో మెరిసిన రష్మికను చూసి దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది అంటూ అక్కడికి వచ్చిన అతిథులు కూడా ముక్కున వేలేసుకున్నారు. మొత్తానికి లెహంగాలో హడావుడి చేసిన రష్మిక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.