Naga Saroja Death : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో ఇటీవల విషాదం నెలకొంది. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగార్జున సోదరి అయినటువంటి నాగ సరోజ అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న నాగ సరోజ గత కొంతకాలంగా ఆసుపత్రిలో ఉంటూ చికిత్సను తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఆమె వైద్యానికి సహకరించకపోవడంతో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
కాగా నాగసరోజ మంగళవారం రోజు కన్నుమూశారట. అంటే ఆమె చనిపోయి దాదాపు రెండు రోజులవుతున్నప్పటికీ ఈ విషయం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే పలు రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే స్వర్గీయ నటుడు నాగేశ్వరరావుకు ఐదు గురు సంతానం. వారే సత్యవతి ,నాగ సుశీల, నాగసరోజ ,వెంకట్, నాగార్జున …అయితే వీరిలో మొదటి బిడ్డ అందరికంటే పెద్ద అయిన సత్యవతి ఎప్పుడో కన్నుమూశారట. ఇక ఇప్పుడు నాగ సరోజ కూడా కన్నుమూయడంతో నాగార్జున ఇద్దరు అక్కలను కోల్పోయిన బాధలో ఉన్నారు. ప్రస్తుతం ఇది అక్కినేని కుటుంబానికి తీవ్ర బాదను కలిగించింది.
అయితే నాగ సరోజ మొదటి నుండి కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చింది. సినిమా ఫంక్షన్స్ లో కానీ బయట ఏ ఇతర ఫంక్షన్ లో కానీ ఆమె పెద్దగా కనిపించదు. ఓ పెద్ద స్టార్ హీరో కూతురు అయినప్పటికీ ఆమె చాలా సింపుల్ గా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఆమె చివరి కాలం వరకు కూడా అలాగే ఉంటూ వచ్చింది. అందుకే ఆమె మరణ వార్త బయటకు రాలేదు. తాజాగా ఆమె అంతక్రియలను ఘనంగా నిర్వహించారు అక్కినేని కుటుంబం. ఈ నేపథ్యంలోనే చాలా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.