” Leo ” Movie Review : తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో విజయ్ నటించిన లియో దసరా కానుకగా ఇటీవల అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా భగవంతు కేసరి మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో ఢీకొట్టబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా యొక్క రివ్యూ ను కొందరు సినీ ప్రముఖులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా చూసిన తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ తన పాత్రలో విజయ్ ఇరగదీసాడు అంటూ ట్విట్ చేసాడు. దీంతో ప్రస్తుతం ఉదయం నిధి స్టాలిన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటించగా అనిరుద్ సంగీత దర్శకత్వం వహించాడు.
అలాగే అర్జున్, సంజయ్ దత్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి వారు కీలక పాత్ర లో కనిపించారు. అయితే లియో సినిమా ప్రపంచవ్యాప్తంగా దాలకు 12,000 స్క్రీన్ లలో విడుదల కాబోతున్నట్టుు సమాచారం. భారత్ తోపాటు నార్త్ అమెరికా ,యూరప్ దుబాయ్ , వంటి దేశాలలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ సినిమా 35 దేశాల్లో రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన వారైతే వన్ మ్యాన్ షో అంటూ విజయ్ ని కొనిఆడుతున్నారు. అలాగే దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజు సినిమాని అద్భుతంగా చిత్రీకరించారని అనిరుద్ సంగీతం కూడా సూపర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఉదయం నిది స్టాలిన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఎల్సీయూ అనే పదాన్ని వాడారు.
ఇక ఈ ఎల్ సి యు అనే పదం ఏంటి అనేది ఇంతవరకు స్పష్టత రాలేదు. కానీ ఆ పదం యొక్క క్లారిటీ మాత్రం వచ్చేసింది. ఎల్ సి యు అనేది సినిమాలో ఒక భాగమని ఈ ఎల్ సి యు నే సినిమా యొక్క హైప్ ని పెంచిందని తెలుస్తోంది. మరోవైపు విక్రమ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమాా అవడంతో అలాగే ధలపతి హీరో అవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వాళ్లు విదేశాల్లో సినిమాని చూసినవారు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా గురించి నెగటివ్ చెప్పకపోవడం గమనార్హం.
సినిమా కథ ఏంటి అంటే..?
ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక పాయింట్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి గ్యాంగ్ స్టర్స్ తో హీరో పోరాటం చేయడం. అలాగే ఈ సినిమాలోఒకరిని పోరి ఒకరు ఉండటం వలన ఒక విజమ్ ని చంపాలనుకున్నవారు మరో వినయ్ ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక అతడిని చంపే క్రమంలో అతను ఎవరినె నిజం తెలుస్తుందా.?అసలు ఆ విజయ్ ఎవరు…?ఇంకొక విజయ్ ఎక్కడున్నాడు..? వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి…అనే కథ పై సినిమా నడుస్తుంది. ఇక పూర్తి వివరాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.