Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి తెలిసిందే కదా. తను ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొనప్పుడు చిలిపిగా మాట్లాడుతూ ఉంటుంది. తను ఎక్కడైనా మాట్లాడినా.. తనను ఎవరైనా ఏదైనా అడిగినా కూడా కొన్ని తప్పు సమాధానాలు చెప్పి ఎన్నోసార్లు అడ్డంగా దొరికిపోయింది. తనపై ఆ మధ్య చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో సక్సెస్ అందుకున్నాక.. ఆలియా భట్ రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తను చేసిన పోస్టులను బట్టి చూస్తే తను త్వరలోనే పండంటి బాబుకు జన్మనివ్వబోతోందని అర్థం అవుతోంది.

చాలా ఏళ్ల పాటు ప్రేమించుకొని చివరకు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. తాజాగా ఆలియా భట్.. మరో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పార్టిసిపేట్ చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోకు తొలి గెస్టులుగా ఈ సీజన్ లో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ వచ్చారు. తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
Alia Bhatt : కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడబడకుండా సమాధానం చెప్పిన ఆలియా
నిజానికి బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వల్లే ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. అన్ని సీజన్లు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దానికి కారణం.. ఈ షోకు వచ్చిన సెలబ్రిటీల పర్సనల్ విషయాలను కూడా కరణ్ లాగేస్తాడు. తాజాగా ఆలియా భట్ ను కూడా కరణ్ ఓ ప్రశ్న అడిగాడు.
ఇక.. ఆలియాకు ఇటీవలే పెళ్లి అయింది కాబట్టి.. తన ఫస్ట్ డెస్టినేషన్ గురించి అడిగాడు కరణ్. దీంతో ఏమాత్రం గుక్కతిప్పుకోకుండా ఫస్ట్ నైట్ లేదు.. గెస్ట్ నైట్ లేదు.. అప్పటికే చాలా అలసిపోయి ఉంటాం కదా అంటూ టక్కున జవాబిచ్చింది ఆలియా. ఇదే కాదు.. ఇలాంటి చాలా ప్రశ్నలకు ఆలియా చకచకా సమాధానాలు చెప్పేసింది. రణ్ వీర్ సింగ్ కూడా అలాగే జవాబులు చెప్పాడు. వీళ్ల ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.